సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 28 ఫిబ్రవరి 2019 (21:30 IST)

కల్యాణ్ రామ్‌తో గొడవ పెట్టుకున్న నివేదా థామస్.. ఎందుకు?

పొట్టిగా, క్యూట్‌గా కనిపించే హీరోయిన్లలో నివేదా థామస్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన సినిమాలో నటించి మెప్పించిందామె. అంతకుముందు ఎన్నో సినిమాల్లోను నటించింది. కానీ తెలుగులో పెద్దగా నివేదకు ఆఫర్లు రాలేదు. అయితే 118 సినిమాలో నివేదకు మంచి అవకాశమే వచ్చింది. యువ నటుడు కళ్యాణ్‌ రామ్ సరసన నటించేందుకు ఆమెకు అవకాశం లభించింది. 
 
సినిమా మొత్తం పూర్తిచేసుకుని రేపు విడుదలవుతోంది. అయితే ఉన్నట్లుండి నటుడు కళ్యాణ్ రామ్.. నివేదా థామస్‌ల మధ్య గొడవ వచ్చిందట. అది కూడా సినిమాకు సంబంధించి రిలీజ్ మొదటి షో అభిమానుల మధ్య కూర్చుని హైదరాబాద్‌లో చూద్దామని కళ్యాణ్‌ రామ్ చెప్పాడట. అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదట. 
 
అభిమానుల మధ్య తోపులాటలు జరుగుతుంది. ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మనం వెళ్ళకూడదు. దీనికి మీరు కూడా దూరంగా ఉంటే మంచిదని చెప్పిందట. అయితే కళ్యాణ్‌ రామ్ ఒప్పుకోలేదట. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.