శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (20:29 IST)

రొమాన్స్‌లో షాలిని అదుర్స్ అన్న హీరో... 40 ముద్దులతో...

చాలా గ్యాప్ తరువాత హీరో కళ్యాణ్ రామ్ మరో కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కళ్యాణ్ రామ్, షాలిని పాండే నటించిన 118 సినిమా మార్చి 1వ తేదీన విడుదల కానుంది. సినిమా విడుదలకు ముందు షాలినీ పాండేపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరో కళ్యాణ్ రామ్.
 
అర్జున్ రెడ్డి సినిమాలో 40కి పైగా ముద్దులతో సినిమాను విజయం వైపు నడిపించారు షాలినీ. హీరో కన్నా హీరోయిన్‌కే ఈ సినిమాలో పేరొచ్చింది. ఈ నేపథ్యంలో షాలినీ పాండేతో మరో రొమాంటిక్ మూవీని సొంత బ్యానర్లో నిర్మించారు కళ్యాణ్ రామ్. సినిమాలో రొమాన్స్ బాగా పండిందని.. షాలినీ పాండే అద్భుతంగా ఆ సీన్లలో నటించిందని చెప్పారు కళ్యాణ్ రామ్. షాలినికి మంచి భవిష్యత్తు ఉందని కితాబిచ్చారు  హీరో కళ్యాణ్ రామ్.