సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : శుక్రవారం, 1 మార్చి 2019 (14:06 IST)

బాలీవుడ్ చిత్రాలు నిషేధిస్తే మనకే నష్టం : పాక్ ఫిల్మ్ ఇండస్ట్రీ

పుల్వామా దాడికి భారత్ ప్రతీకార దాడులు చేసిన నేపథ్యంలో పాకిస్థాన్ భారత్‌పై పలు ఆంక్షలు విధించింది. అందులో బాలీవుడ్ సినిమాలను పాకిస్థాన్‌లో విడుదల చేయనివ్వం అనేది ఒకటి. అయితే పాకిస్థాన్ విధించిన ఈ ఆంక్షల వల్ల వారి దేశానికే నష్టమని పాకిస్థాన్ ప్రజలతో పాటు చిత్ర ప్రముఖులు, ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు. 
 
సాధారణంగా ఇండియాలో నిర్మించిన సినిమాలను ఇండియా వరకు విడుదల చేసినా మంచి లాభాలు వస్తాయి, కానీ పాకిస్థాన్ పరిస్థితి వేరు, అక్కడ తీసిన సినిమాలకు ఆదాయాలు రావాలంటే వారు తప్పకుండా భారత్‌లో విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది.
 
పాకిస్థాన్‌లో ఇప్పటివరకు కేవలం 130 థియేటర్స్ మాత్రమే ఉన్నాయి. ఇదే భారత్‌లో దాదాపు 7000 స్క్రీన్స్ ఉండగా ఇందులో దాదాపు 5000 సింగిల్ స్క్రీన్‌లు, మరో 2000 స్క్రీన్‌లు మల్టీప్లెక్స్‌లో ఉన్నాయి. అక్కడ థియేటర్స్ చాలా తక్కువ కావడం వల్ల మన సినిమాలు విడుదల కాకుంటే మనవారికి వచ్చే నష్టం చాలా తక్కువ. 
 
అదే ఇంత భారీ సంఖ్యలో స్క్రీన్‌లు ఉన్న భారతదేశంలో పాకిస్థాన్ సినిమాలు విడుదల కాకుంటే వారికే ఎక్కువ నష్టమని అక్కడి సినీ పరిశ్రమ వాపోతోంది. బాలీవుడ్ సినిమాలను పాకిస్థాన్‌లో విడుదల చేయడం వల్ల అక్కడి డిస్ట్రిబ్యూటర్లు సంవత్సరానికి దాదాపు 700 కోట్ల రూపాయల ఆదాయాలు పొందుతున్నారు. అంటే పాకిస్థాన్ చర్య వల్ల వాళ్ల ఆదాయ మార్గాలకు వారే గండి కొట్టుకున్నారని అనుకోవచ్చు.