బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : గురువారం, 28 ఫిబ్రవరి 2019 (18:29 IST)

రాఘవేంద్రరావు సినిమాలో షారూఖ్ ఖాన్..?

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ కె. రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ కోవెల మూడి దర్శకత్వంలో నటించనున్నారు. అయితే ఈ సినిమాలో పూర్తి స్థాయిలో కాకుండా అతిథి పాత్ర చేయబోతున్నడట. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రకాష్ కోవెలమూడి ప్రస్తుతం బాలీవుడ్‌లో 'మెంటల్ హై క్యా' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. 
 
ఈ సినిమాలో కంగనా రనౌత్, రాజ్ కుమార్ రావులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో కీలకమైన పాత్ర కోసం షారూఖ్ ఖాన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఖాన్ ఈ ఆఫర్‌కు అనుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఈ ఏడాది మార్చి 29న విడుదల చేసే యోచనలో ఉన్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.