సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 2 మార్చి 2019 (18:09 IST)

జనసేన పార్టీలో చేరుతానా? నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎలా?: రేణూ దేశాయ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ ఇటీవల కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి రైతుల కష్టనష్టాలను అడిగారు. అదీ సాక్షి టీవీ మైకుతో అక్కడికెళ్లి ఇంటర్వ్యూలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. కర్నూలులో రేణు పర్యటించడం ద్వారా ఆమె జనసేనకు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకే ఈ పని చేసిందని విమర్శలు ఎదురయ్యాయి. 
 
అయితే ఆపై రేణూ దేశాయ్ కర్నూలు జిల్లా రైతులతో భేటీకి వివరణ ఇచ్చింది. రైతు సమస్యలపై సినిమా చేస్తున్నానని ఇందుకు ఆధారంగా ఓ షో కూడా నిర్వహిస్తున్నానని ఇందులో భాగంగా ఈ ఇంటర్వ్యూలు అంటూ చెప్పుకొచ్చింది. ఇంతటితో ఈ వివాదానికి తెరపడింది. తాజాగా జనసేన పార్టీలో రేణూ దేశాయ్ చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. ఈ వార్తలపై రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చింది. 
 
నెటిజన్లు అడిగిన ఈ ప్రశ్నకు రేణు అసహనం వ్యక్తం చేసింది. తాను ఏదైనా రాజకీయ పార్టీలో చేరే అవకాశం ఉంటే... అందులో సీక్రెట్ ఉండదని తెలిపింది. తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదనే విషయం అందరికీ తెలుసని వెల్లడించింది. జనాలు నోటికి వచ్చినట్లు ఏదేదో మాట్లాడేస్తున్నారని రేణు  వెల్లడించింది.