గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. మహామహులు
Written By
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (16:26 IST)

దొంగ దొంగ.. అన్నయ్య.. బౌలింగ్ కోచ్ ఎలా అయ్యాడు? (video)

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన దొంగ దొంగ చిత్రంలో హీరోగా నటించిన ఆనంద్ గుర్తుండేవుంటాడు. ప్రస్తుతం ఆనంద్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, టెలివిజయ్ సీరియళ్ల ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే. ఆనంద్‌‌కు భారత క్రికెట్ జట్టుకు చాలాకాలంగా బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్న భరత్ అరుణ్‌కు లింకుంది. భరత్ అరుణ్ సోదరుడే ఆనంద్. అక్కా బాగున్నావా, పెళ్లాల రాజ్యం, అమ్మాయి కాపురం, ఆంటీ వంటి చిత్రాల్లో ఆనంద్ నటించాడు. 
 
ఆనంద్ నలుగురు అన్నదమ్ముల్లో చివరివాడు. ఇకమూడోవాడైన భరత్ అరుణ్ క్రికెటర్. భరత్ భారత జట్టు తరఫున రెండు టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడాడు. పేస్ బౌలింగ్‌లో మంచి ప్రతిభ చూపించే భరత్‌కు అదృష్టం కలిసిరాకపోవడంతో మొదట్లో పెద్దగా అవకాశాలు దక్కలేదు. దాంతో రంజీ క్రికెట్‌కు పరిమితం అయ్యాడు. క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రికి సన్నిహిత మిత్రుడు కావడంతో టీమిండియా బౌలింగ్ కోచ్ పదవి వరించింది. 
 
పెద్దగా కష్టపడకుండానే బౌలింగ్ కోచ్‌గా ఎంపికైనా, టీమిండియా బౌలర్లను సానబెట్టేందుకు ఎంతో కష్టపడ్డాడు భరత్ అరుణ్. ఆ శ్రమ ఫలితమే టీమిండియా బౌలింగ్ దళం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బౌలింగ్ యూనిట్‌గా పేరుపొందింది.
 
ఈ నేపథ్యంలో భరత్ అరుణ్ రిషబ్ పంత్ గురించి స్పందించాడు. ధోనీలా వికెట్ కీపింగ్‌ రాణించలేకపోతున్నాడని.. తేలిపోతున్నాడని వస్తున్న కామెంట్లపై భరత్ అరుణ్ వ్యాఖ్యానించాడు. ధోనీతో రిషబ్‌ను పోల్చకూడదన్నాడు. మొహాలీలో జరిగిన వన్డేలో రిషబ్ పంత్ రాణించలేకోపోయాడని విమర్శలు ఎదుర్కొన్న వేళ.. భరత్ అరుణ్ రిషబ్ పంత్‌కు అండగా నిలిచాడు. 
 
ధోనీ లెజండ్ అని.. అతను ఎన్నో స్టంప్స్ వెనుక ఆడాడు. ఇంకా వికెట్ కీపర్‌గా, కెప్టెన్‌గా పూర్తిస్థాయిలో నైపుణ్యత సాధించాడని చెప్పాడు. రిషబ్ పంత్ కూడా వికెట్ కీపింగ్‌లో రాణిస్తాడని.. అలాగే ఆల్ రౌండర్లలో విజయ్ శంకర్ రాణిస్తాడని భరత్ అరుణ్ వెల్లడించాడు.