శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసు
Last Updated : సోమవారం, 11 మార్చి 2019 (17:51 IST)

సాయం చేస్తున్నట్లే వేధించారు... ఆస్పత్రిలో ఉన్నా వేధింపులు తప్పవా? విజయలక్ష్మి

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటి విజయలక్ష్మి... తనను నటుడు రవి ప్రకాష్ మానసికంగానూ లైంగికంగానూ వేధించిన్నట్లు పుట్టేనహళ్లి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఆవిడ ఫిర్యాదులోని వివరాల మేరకు.. తను కొద్దిరోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు ఫిబ్రవరి 27వ తేదీన నటుడు రవి ప్రకాష్ ఆస్పత్రికి వచ్చి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసారనీ అనంతరం ప్రతి రోజూ ఐసీయూకు వస్తూండటం, పదే పదే ఫోన్‌ మెసేజ్‌లు చేయడం వంటివి చేస్తూ అసభ్యంగా ప్రవర్తించేవారనీ ఆరోపించారు. 
 
ఈ మేరకు ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, వైరల్‌గా మారింది. కాగా... నటుడు రవి ప్రకాష్ ఆవిడ చేసిన ఆరోపణలను ఖండించారు. మీడియాలో సాయం చేయాలని కోరటం వలన ఆమెకు లక్ష రూపాయల మొత్తం సాయం చేసానే గానీ లైంగికంగా వేధించలేదని చెప్పుకొచ్చారు. ఆమెతో తను మాట్లాడిన కాల్‌ రికార్డ్‌ ఉందని పేర్కొన్న ఆయన కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయటమే తన తప్పని వాపోయారు.