శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 9 జనవరి 2019 (17:58 IST)

నిత్యామీనన్ ''ప్రాణ'' ప్రయోగమే.. మహానాయకుడు, యాత్రకు మధ్య?

నిత్యామీనన్ పాత్రల ఎంపికలో ఆచితూచీ అడుగులు వేస్తోంది. తాజాగా నిత్యామీనన్.. అమ్మ బయోపిక్‌లో నటిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్‌లో మహానటి సావిత్రిగా నిత్యామీనన్ కనిపించింది. మరోవైపు ''ప్రాణ'' అనే సినిమాలోనూ నిత్యమీనన్ నటించింది. ఈ సినిమా మొత్తం ఒక్క నిత్యామీనన్ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఆమె చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. ఒకరకంగా ఇది ప్రయోగాత్మక చిత్రం. 
 
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. వీకే ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నాలుగు భాషల్లో విడుదల కానుంది. జనవరి 18వ తేదీన మలయాళంలో, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 
 
సంక్రాంతి సినిమాలు ఓ వైపు.. ఫిబ్రవరి ఏడో తేదీన మహానాయకుడు, ఫిబ్రవరి 8వ తేదీన యాత్ర సినిమాలు విడుదల కానున్నాయి. ఈ పెద్ద సినిమాల విడుదల మధ్య ''ప్రాణ''ను రిలీజ్ చేయడం పెద్ద సాహసమనే చెప్పాలి. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌ను ఓ లుక్కేయండి..