1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Chiranjeevi MSG Creates All-Time Record On OTT

Chiranjeevi: ఓటీటీలో రికార్డు సృష్టించిన మన శంకర వర ప్రసాద్ గారు

Mana Shankara Vara Prasad Garu
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కలిసి మన శంకర వర ప్రసాద్ గారు సినిమా సూపర్ రికార్డును సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టి, ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా వసూలు చేసి చిరంజీవి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా అవతరించింది. ప్రస్తుతం ఈ సినిమా డిజిటల్ రంగంలోనూ బాక్సాఫీసును షేక్ చేసింది. 
 
జీ5 ద్వారా ఓటీటీకి వచ్చిన ఈ సినిమా మొదటి 24 గంటల్లోనే 200 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను సాధించింది. ఈ ఫీట్ ప్లాట్‌ఫామ్‌పై ఏ చిత్రానికి అయినా అతిపెద్ద ఓపెనింగ్‌గా నిలిచింది. 
 
మెగాస్టార్ పట్ల ప్రేక్షకుల ప్రేమ సాటిలేనిదని రుజువు చేస్తుంది. అనిల్ రావిపూడి సిగ్నేచర్ ఎంటర్‌టైన్‌మెంట్ శైలి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించింది. విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో నటించారు. సాహు గారపాటి సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం భారీ స్థాయి ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది.
తర్వాతి కథనం
నడిరోడ్డు మీద నటులు విజయ్, అజిత్ ఫైటింగ్, వీడియో వైరల్