శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : మంగళవారం, 12 మార్చి 2019 (14:49 IST)

ఎన్నారై భర్తతో ఏడాదికి రెండుసార్లే శృంగారం... కానీ ఇప్పుడు?

ఇప్పుడు సరిగ్గా నా వయసు 37 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు వున్నారు. బాగా డబ్బు వున్న వ్యక్తికిచ్చి పెళ్లి చేయాలని ఓ ఎన్నారై అబ్బాయినిచ్చి పెళ్లి చేశారు నాకు. పెళ్లయ్యాక నాకు గ్రీన్ కార్డ్ రాలేదు. దాంతో నేనిక్కడ ఆయనక్కడ అయిపోయింది. ఏడాదికి రెండుసార్లు వచ్చి నాతో విపరీతంగా శృంగారం చేసేవాడు. ఇలా 15 రోజులు చేసి ఆ తర్వాత విమానం ఎక్కేసి వెళ్లిపోయేవాడు. 
 
ఆ తర్వాత నేను శృంగార కోర్కెలతో పిచ్చెక్కిపోయేదాన్ని. కానీ యోగ, ధ్యానం తదితర సాధనాలతో శృంగార కోర్కెలకు కళ్లెం వేసేశాను. వాటిని పూర్తిగా తొక్కేశాను. ఇన్నేళ్లకు ఆయన అక్కడ నుంచి శాశ్వతంగా వచ్చేశారు. ఇప్పుడు తిరిగి గతంలో మాదిరిగా పొద్దస్తమానం శృంగారం చేయాలంటూ వేధిస్తున్నారు. నాలో దాదాపు ఆ కోర్కెలు చచ్చిపోయాయి. ఆయన ఒత్తిడి మేరకు ఒప్పుకుంటున్నా కానీ నాకు అస్సలు ఇష్టం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏదో ఒకరోజు ఆయనతో కొట్లాటకు దిగుతానేమోనన్న డౌటుగా వుంది. ఏం చేయాలి?
 
ఏ సమస్య పరిష్కారానికైనా ప్రధానంగా చర్చలు, సమాచార మార్పిడే ముఖ్యం. ఇది భార్యాభర్తల దాంపత్య జీవితానికి సంబంధించిన అంశం. ఈ విషయాలు, సమస్యలు అక్కడే పరిష్కరించుకోవాలి. దాంపత్య జీవితంలో శృంగారం అత్యంత ముఖ్యమైనది. అదేసమయంలో స్త్రీపురుషులిద్దరూ యాక్టివ్ రోల్ పోషిస్తేనే ఈ జీవితం ఆనందమయంగా ఉంటుంది. 
 
అయితే, భార్య అయిష్టతను ప్రదర్శిస్తే భర్తలు పెడదోవపట్టే అవకాశం వుంటుంది. అలాగే శృంగారాన్ని అణచివేశానని అనుకోవడం భ్రమ. ఆకలి, దప్పిక ఎలాంటివో ఇది కూడా అలాంటిదే. కాబట్టి యోగ, ధ్యానం అంటూ చెపుతున్నవి ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ శృంగార కోర్కెలను తొక్కేసేవి కాదని గమనించండి. కాకపోతే సుదీర్ఘకాలంగా దూరంగా వున్నారు కాబట్టి ఆ ప్రక్రియపై మీరు అయిష్టతను పెంచుకుని వుండవచ్చు. ఇపుడు భర్త పూర్తిగా మీతోనే వుంటున్నారు కాబట్టి హాయిగా గడిపేందుకు అదే యోగ, ధ్యానాన్ని సాధనంగా చేసుకుని తిరిగి మామూలు స్థితికి వచ్చేయండి. సంతోషంగా వుంటుంది.