సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: సోమవారం, 18 మార్చి 2019 (17:53 IST)

ప్రేమగా కుక్కపిల్లను తీసుకున్నాడు... ప్యాంటు విప్పి రేప్ చేశాడు.. ఎక్కడ?

కామాంధులు మహిళలనే కాదు జంతువులను కూడా వదిలిపెట్టడంలేదు. కంటికి కనిపించిన జంతువులను పట్టుకుని వాటిపై అత్యాచారాలు చేస్తున్నారు. తాజాగా చెన్నైలో ఓ కామాంధ యువకుడు చేసిన దారుణం సీసీ టీవీకి చిక్కింది. ఉత్తర చెన్నైలోని ఓ ప్రాంతంలో ఓ కుక్కకి 15 కుక్కపిల్లలు పుట్టాయి. అవన్నీ ఓ గ్రౌండులో వుంటూ వస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ఓ యువకుడు ఆ కుక్కపిల్లల వద్దకు వచ్చి ఓ నల్ల కుక్కపిల్లను తీసుకున్నాడు. అతడలా కుక్కపిల్లను తీసుకోవడాన్ని గ్రౌండు పక్కన ఇంట్లో నివాసముంటున్న ఓ మహిళ గమనించింది. ఆ కుక్కపిల్లను ముద్దుచేసేందుకు తీసుకున్నాడులే అని అనుకునేలోపుగా గబుక్కున ప్యాంటు జిప్ తీసి ఆ కుక్కపిల్లపై అత్యాచారం చేయడం ప్రారంభించాడు. 
 
ఆ దారుణాన్ని చూసిన మహిళ షాక్ తిన్నది. వెంటనే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజిలో వున్న యువకుడి కోసం గాలిస్తున్నారు. కాగా కుక్కపిల్లలను పరీక్షించగా వాటిలో అరడజను కుక్కపిల్లలపై అత్యాచారం జరిగినట్లు తేలింది.