సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వాసుదేవన్
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2019 (14:53 IST)

రానాకు థ్యాంక్స్ చెప్పిన యంగ్ టైగర్.. ఎందుకు?

ఈ మధ్య కాలంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఉన్న ఫొటోలు నెట్‌లో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలందరం స్నేహితులమే అని చెప్పడానికిగానూ వారు ఒకరి సినిమాకి సంబంధించిన వేడుకలకు మరొకరు అతిథులుగా హాజరవుతూ... అభిమానులకు సానుకూల సంకేతాలను పంపిస్తూంటారు. 
 
ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ అయితే ఏకంగా కలిసి సినిమా కూడా చేసేస్తున్నారు. వీళ్ల సంగతి ఇలా ఉంటే హీరోలందరితోనూ సత్సంబంధాలను కొనసాగించే దగ్గుబాటి రానా.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఒక సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి సంభ్రమాశ్చర్యాలకు లోను చేసాడు.
 
ఈ మేరకు... రానా ఎన్టీఆర్‌కు అమరచిత్ర కథ అనే పుస్తకాల సిరీస్‌ను గిఫ్ట్‌గా పంపారట. అమరచిత్రకథ పుస్తకాలలో మన పురాణాలు, చరిత్రలోని గొప్ప‌ వ్యక్తుల జీవితాలు, జానపద కథలు, వీరగాథలు వంటివి కామిక్స్ రూపంలో ఉంటాయి. 
 
అవన్నీ ఉండే అమరచిత్రకథ బుక్స్‌ని ఎన్టీఆర్‌కు రానా గిఫ్ట్‌గా పంపడంతో ఎన్టీఆర్ ఎంతగానో మురిసిపోతూ.. ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకుంటూ... ‘‘చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈ కామిక్ అమరచిత్రకథ పుస్తకాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు రానా. వీటితో నా బాల్యాన్ని అభయ్‌తో పంచుకోవడానికి అవకాశం కల్పించావు..’’ అంటూ ఎంతో ఆనందంతో ట్వీట్ చేసాడు ఈ యంగ్ టైగర్.