బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 8 అక్టోబరు 2017 (13:50 IST)

కల్కి కోయెచిన్‌తో ప్రేమలో పడ్డాను.. ఆ కండిషన్‌ను బ్రేక్ చేశాను: అనురాగ్ కశ్యప్

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తన సినిమా షూటింగ్‌లో నటించే హీరోహీరోయిన్లకు చాలా కండిషన్లే పెట్టేవాడు. ఇందులో భాగంగా తన సినిమా షూటింగ్ సెట్లో నటీనటులు ఎవరూ ప్రేమలో పడకూడదని ఓ కండిషన్ పెట్టానని.. క

బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తన సినిమా షూటింగ్‌లో నటించే హీరోహీరోయిన్లకు చాలా కండిషన్లే పెట్టేవాడు. ఇందులో భాగంగా తన సినిమా షూటింగ్ సెట్లో నటీనటులు ఎవరూ ప్రేమలో పడకూడదని ఓ కండిషన్ పెట్టానని.. కానీ ఆ కండిషన్‌ను మొదట తానే బ్రేక్‌ చేశానని వెల్లడించాడు. తన ప్రేమ గురించి ఆసక్తికరమైన విషయాన్ని చాలా రోజుల తరువాత బయటపెట్టాడు అనురాగ్ కశ్యప్. ''జియో మామి ఫిల్మ్ ఫెస్టివల్'' 19వ ఎడిషన్ మూవీ మేళాలో ఆసక్తికర అంశాన్ని అభిమానులతో పంచుకున్నాడు.
 
2009లో ‘దేవ్ డి’ సినిమా చిత్రీకరణ సమయంలో ఈ నిబంధన పెట్టానని తెలిపాడు. ఇక ఈ సినిమాలో చంద్రముఖిగా నటించిన కల్కి కోయెచిన్‌తో ప్రేమలో పడ్డానని తెలిపారు. అయితే ఆ తరువాత రెండేళ్లపాటు ప్రేమించుకున్న వీరిద్దరూ 2011లో వివాహం చేసుకున్నారు. కానీ ఎక్కువ రోజులు తమ బంధాన్ని నిలుపుకోలేకపోయి, 2015లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.