శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (19:01 IST)

విడాకుల తీసుకున్నవారిలో గుండె జబ్బు, విడిపోయాక వేరొకరితో వుంటే...

వైవాహిక బంధం ఆరోగ్యకరంగా ఉంటే మనిషి ఆరోగ్యం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా గుండె విషయాన్ని చూస్తే... వైవాహిక బంధం పటిష్టంగా ఉన్నవారిలో గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుందట. వివాహ బంధం విచ్ఛిన్నమై విడాకులకు దారితీసి వారిలో అత్యధికులు గుండె జబ్బుల బారిన

వైవాహిక బంధం ఆరోగ్యకరంగా ఉంటే మనిషి ఆరోగ్యం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా గుండె విషయాన్ని చూస్తే... వైవాహిక బంధం పటిష్టంగా ఉన్నవారిలో గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుందట. వివాహ బంధం విచ్ఛిన్నమై విడాకులకు దారితీసి వారిలో అత్యధికులు గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉన్నదని అమెరికాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
 
ఈ పరిశోధక బృందం 15 వేలమంది 45 నుంచి 80 ఏళ్ల మధ్య వయస్కులైన స్త్రీ, పురుషులపైన అధ్యయనం చేశారు. విడాకులు తీసుకున్నవారు, వైవాహిక దాంపత్యంలో ఆనందంగా ఉన్నవారు, విడాకులు తీసుకున్న తర్వాత మరొకరిని వివాహం చేసుకున్నవారు... ఇలా మూడు వర్గాలుగా వారి పరిశోధన సాగింది.
 
ఈ అధ్యయనంలో వారు సదరు వ్యక్తులపైన రకరకాల ప్రశ్నలను సంధించారు. ఆ తర్వాత వారి ఆరోగ్యం స్థితిగతులను కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ వచ్చారు. ఇందులో తేలిన విషయమేమంటే విడాకులు తీసుకున్నవారిలో గుండె సంబంధిత జబ్బులు తలెత్తుతున్నట్లు కనుగొన్నారు. ఒకవేళ విడాకులు తీసుకున్న వారు మరో భాగస్వామితో వైవాహిక బంధంతో ఉన్నట్లయితే వారిలో ఆ గుండె జబ్బుల సమస్య తలెత్తడం లేదని కనుగొన్నారు.