సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2017 (11:17 IST)

విడాకులు తీసుకున్నా... సన్నిహితంగానే ఉంటున్నాం.. సంగీతా బిజ్లానీ

భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌తో విడాకులు తీసుకున్నప్పటికీ తామిద్దరం సన్నిహితంగానే ఉంటున్నట్టు ఆయన మాజీ భార్య సంగీతా బిజ్లానీ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానీతో పరిచయం ఏర్పడిన తర్వాత అజ

భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌తో విడాకులు తీసుకున్నప్పటికీ తామిద్దరం సన్నిహితంగానే ఉంటున్నట్టు ఆయన మాజీ భార్య సంగీతా బిజ్లానీ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానీతో పరిచయం ఏర్పడిన తర్వాత అజారుద్దీన్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆతర్వాత సంగీతాను వివాహం చేసుకున్నాడు. కొద్దిరోజులు కాపురం చేశాక.. వీరిద్దరు కూడా విడిపోయారు. 
 
ఈ నేపథ్యంలో తమ సంబంధంపై సంగీతా తాజాగా స్పందిస్తూ... అజారుద్దీన్‌తో విడాకులు తీసుకున్నప్పటికీ... ఆయనతో సన్నిహితంగానే ఉన్నానని చెప్పుకొచ్చింది. అదేసమయంలో అజార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'అజార్' సినిమాలో వాస్తవాలను తప్పుగా చూపించారని ఆమె మండిపడింది. 
 
ఈ సినిమాను చూసిన వారంతా మ్యాచ్ ఫిక్సింగ్ కేసును మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటారని వ్యాఖ్యానించింది. తాను, అజార్ మొదటిసారి కలుసుకున్న సన్నివేశాన్ని కూడా తప్పుగా చూపించారని తెలిపింది. 1996లో అజార్‌ను సంగీత పెళ్లాడింది.