సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 5 జూన్ 2018 (10:10 IST)

బిగ్ బాస్ సీజన్-2లో నందమూరి తారకరత్న..?

బిగ్ బాస్ సీజన్-2కి రంగం సిద్ధమైంది. బిగ్ బాస్ రెండో సీజ‌న్‌కి నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ కార్యక్రమం వంద రోజుల పాటు జరుగనుంది. 16మంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జూన్ 10 న

బిగ్ బాస్ సీజన్-2కి రంగం సిద్ధమైంది. బిగ్ బాస్ రెండో సీజ‌న్‌కి నాని హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఈ కార్యక్రమం వంద రోజుల పాటు జరుగనుంది. 16మంది సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. జూన్ 10 నుంచి ప్రారంభమయ్యే ''బిగ్ బాస్ 2'' షోలో పాల్గొనబోయేది వీరే అంటూ కొంతమంది సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. 
 
ఈ క్రమంలో నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక హీరో బిగ్ బాస్‌-2కి సెలెక్ట్ అయ్యాడనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. బిగ్‌బాస్ ద్వారా తన ఫేమ్‌ని మెరుగుపర్చుకోవాలని తారక్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. హీరోగా సక్సెస్ కాలేక.. అడపాదడపా విలన్ క్యారెక్టర్లను కూడా ట్రై చేస్తున్న తారక్.. బిగ్‌బాస్ ద్వారా హీరో ఛాన్సులు చేజిక్కించుకునేందుకు తారక్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.