అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారుపై రచ్చ : ఆ యాంకర్ కాళ్లు విరగ్గొడతామంటున్న మహిళలు.. ఎందుకు?
బుల్లితెర నటుడు, యాంకర్ రవిపై మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తమ కంటికి కనిపిస్తే కాళ్లు విరగ్గొడతామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ యాంకర్ రవి చేసిన తప్పేంటో ఓ సారి తెలుసుకుందాం.
బుల్లితెర నటుడు, యాంకర్ రవిపై మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తమ కంటికి కనిపిస్తే కాళ్లు విరగ్గొడతామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ యాంకర్ రవి చేసిన తప్పేంటో ఓ సారి తెలుసుకుందాం.
నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం "రారండోయ్ వేడుక చూద్దాం". ఈ చిత్రం ఆడియో వేడుక గత ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో కార్యక్రమ మహిళా వ్యాఖ్యాత అడిగిన ప్రశ్నకు సీనియర్ నటుడు చలపతి రావు ఇచ్చిన సమాధానం పెను వివాదమైంది. ఈ వివాదం చివరకు ఆయన మెడకు చుట్టుకునేలా ఉంది. చలపతిరావు చేసిన అసభ్యకర వ్యాఖ్యాలతో మహిళాలోకం భగ్గుమంది. చలపతిరావుపై ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతటితో శాంతించని మహిళా సంఘం నేతలు యాంకర్ రవిపై కూడా మండిపడుతున్నారు. కనీస ఇంగితజ్ఞానం లేకుండా, సీనియర్ నటుడనే సంస్కారం లేకుండా ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడిన చలపతిరావు మహిళలకే కాకుండా మానవజాతి మొత్తానికి క్షమాపణ చెప్పాలని సజయ డిమాండ్ చేశారు. చలపతిరావు చేసిన కామెంట్‌కు ‘సూపర్ సర్’ అన్న యాంకర్ రవి తమకు కనిపిస్తే కాళ్లు విడగ్గొడతామని హెచ్చరించారు.
దీనిపై మహిళా ఉద్యమకారణి సజయ మాట్లాడుతూ.. 'నువ్వు యాంకర్‌గా ఉండాలంటే ఉండు. నీకు ఉన్న టాలెంట్ చూపించు. కానీ ఈ రకమైన కామెంట్లు చేయకు. వాట్ సూపర్?.. నీ తల్లిని అట్లా మాట్లాడితే నువ్వు సూపర్ అంటావా రవి? చెప్పు? ఎవడు వాడు అసలు? వాడి వయసెంత.. వాడు సూపర్ అని మాట్లాడడానికి. వాడు క్షమాపణ చెప్పాలి.. నాగార్జునగారు చెప్పాలి. వాళ్ల కుటుంబం తరపున, ఇండస్ట్రీ తరపున బయటకొచ్చి మేం క్షమాపణ చెబుతున్నాం అని నాగార్జున గారు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ సినిమాకు ఆ ట్యాగ్ లైన్ తీసెయ్యాలి' అని ప్రముఖ ఉద్యమకారిణి సజయ డిమాండ్ చేశారు.