శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 డిశెంబరు 2019 (18:29 IST)

బాహుబలి 2 ఆ లిస్టులో లేదా? యాహూ అవమానపరిచిందా? (video)

బాహుబలి సినిమా ప్రపంచ సినిమా ప్రేక్షకులను టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసింది. కానీ భారీ కలెక్షన్లు, రికార్డులు కొల్లగొట్టిన బాహుబలి 2 సినిమా, తాజాగా యాహు ఇండియా సంస్థ ఈ దశాబ్ద కాలపు బెస్ట్ మూవీ ఏది అంటూ నిర్వహించిన రివ్యూలో చేర్చబడిన పది సినిమాల లిస్ట్‌లో లేకపోవడం అందరిని ఎంతో ఆశ్చర్యపరిచింది.
 
ఆ జాబితాలో దంగల్, భజరంగి భాయి జాన్, సుల్తాన్, టైగర్ జిందా హై తదితర సినిమాలన్నీ ఉన్నప్పటికీ, వాటన్నిటికీ మించేలా అద్భుత విజయాన్ని అందుకున్న బాహుబలి 2 లేకపోవడం ఒకరకంగా మన తెలుగు సినిమాలను బాలీవుడ్ వారు అవమానించడమేనని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

ఇకపోతే, కలెక్షన్స్ పరంగా చూసుకుంటే దంగల్‌కు, బాహుబలి 2కు స్వల్ప తేడా మాత్రమే. అలాంటి సినిమా యాహూ లిస్టులో లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.