శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 2 మే 2018 (11:07 IST)

కాలా నుంచి ''యమ గ్రేట్'' సాంగ్ వీడియో మీ కోసం..

తలైవా ఫ్యాన్స్ ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం నుండి తాజాగా ఫ‌స్ట్ సాంగ్‌ని విడుదల చేశారు. ''యమ గ్రేట్'' అంటూ సాగే ఈ పాట రజనీ ఫ్యాన్స్‌ను అలరిస్తుంది. తెలుగ

తలైవా ఫ్యాన్స్ ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రం నుండి తాజాగా ఫ‌స్ట్ సాంగ్‌ని విడుదల చేశారు. ''యమ గ్రేట్'' అంటూ సాగే ఈ పాట రజనీ ఫ్యాన్స్‌ను అలరిస్తుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ఈ సివిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. 
 
ఈ పాట‌కి తెలుగు లిరిక్స్‌ను ప్రణవ్ చాగంటి అందించగా హ‌రిహ‌ర‌సుధ‌న్, సంతోష్ నారాయణ్ క‌లిసి పాడారు. కాగా ఈ చిత్రం పూర్తి ఆడియోను మే 9న విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని పా రంజిత్ దర్శకత్వం వహించగా, ఈ సినిమాలో రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్‌గా నటించారు. ఇందులో రజనీకాంత్‌తో పాటు హుమా ఖురేషి, నానా పటేకర్, ఈశ్వరి రావు, సముద్రకణి, అంజలి పటేల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని యమ గ్రేట్ పాటనును వీడియో ద్వారా ఓ లుక్కేయండి.