శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By selvi
Last Updated : శనివారం, 28 ఏప్రియల్ 2018 (09:19 IST)

స్టైల్ స్టైల్.. రజనీకాంత్ ఫోటోస్ అదుర్స్.. సోషల్ మీడియాలో వైరల్

సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్టైల్‌కు ఫిదా అయిన అభిమానులు చాలామందే వున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌కు చెందిన కొన్ని ఫోటోలు వున్నాయి. ఇటీవల హిమాలయాలకు వె

సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన స్టైల్‌కు ఫిదా అయిన అభిమానులు చాలామందే వున్నారు. ప్రస్తుతం రజనీకాంత్‌కు చెందిన కొన్ని ఫోటోలు వున్నాయి. ఇటీవల హిమాలయాలకు వెళ్లిన రజనీకాంత్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. బ్లాక్ కలర్ టీషర్ట్‌లో ఆయన అమెరికా మెట్రోస్టేషన్‌లో కనపడ్డారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 
కాగా రజనీకాంత్ అమెరికా ట్రిప్పేశారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం త‌న పెద్ద కూతురు ఐశ్వ‌ర్య‌తో కలిసి రజనీకాంత్ అమెరికా వెళ్ళారు. యూఎస్ ఎయిర్‌పోర్ట్‌లో క్యాజువ‌ల్ డ్రెస్ ధ‌రించి బ్లాక్ స‌న్‌గ్లాసెస్‌తో రజనీకాంత్ చాలా స్టైలిష్‌గా ఈ ఫోటోల్లో కనిపించారు. మే రెండో వారం వ‌ర‌కు త‌లైవా అమెరికాలోనే ఉంటార‌ని సమాచారం. అమెరికా నుంచి తిరిగొచ్చాక రజనీకాంత్ కాలా సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.