శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 28 ఏప్రియల్ 2018 (09:01 IST)

మదర్సాలో గ్యాంగ్‌రేప్‌... ఘజియాబాద్‌లో ఘోరం...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపర్వం మాత్రం ఆగడం లేదు. మొన్నటికి మొన్న జరిగిన ఉన్నావ్ అత్యాచార ఘటన మరువకముందే తాజాగా ఘజియాబాద్‌లో మరో దారుణం జరిగింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపర్వం మాత్రం ఆగడం లేదు. మొన్నటికి మొన్న జరిగిన ఉన్నావ్ అత్యాచార ఘటన మరువకముందే తాజాగా ఘజియాబాద్‌లో మరో దారుణం జరిగింది. అదీ కూడా ఓ మదర్సాలో. పదకొండేళ్ల బాలిక గ్యాంగ్‌రేప్‌కు గురైంది. బాలికను పోలీసులు ఈనెల 22న రక్షించగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
ఈనెల 21వ తేదీన ఆమె మార్కెట్‌కు వెళ్లేటపుడు స్నేహితుడిని కలుద్దామని చెప్పి పొరుగింటి బాలిక ఆమెను ఘజియాబాద్‌లోని మైనర్‌ బాలుడి వద్దకు తీసుకెళ్లింది. అక్కడ మదర్సా మౌలీ, మైనర్‌ ఆమెను మదర్సాలోని ఓ గదిలో బంధించి లైంగిక దాడులకు పాల్పడ్డారు. తరగతి గదుల్లో వినిపించే అరుపులతో ఆమె ఆర్తనాదాలు ఎవరికీ వినబడలేదు. మదర్సాకు వచ్చేవారు కూడా తనను అసభ్యకరంగా తాకేవారని బాలిక చెప్పింది. బాధిత బాలిక  ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. 
 
మౌల్వీ గులామ్‌ షాహిద్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మైనర్‌ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికను అసభ్యంగా తాకిన వారినీ గుర్తించేందుకు గాలింపు చేపట్టారు. బాధితురాలిని రక్షించడానికి వెళ్లినపుడు ఆమె ఓ చాపలో చుట్టబడి ఉందని పోలీసులు తెలిపారు. మైనర్‌ బాలుడు కూడా మదర్సా విద్యార్థే. అయితే బాలికను మౌల్వీ కిడ్నాప్‌ చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.