శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 28 ఏప్రియల్ 2018 (09:09 IST)

కర్ణాటక ఎన్నికలు : జేడీఎస్ తరపున పవన్ ప్రచారం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రచార బరిలో హేమాహెమీలు ఉన్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 12వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల కోసం ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రచార బరిలో హేమాహెమీలు ఉన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు అటు బీజేపీ, జేడీఎస్‌లు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పోటీలో ఉన్న జేడీఎస్ తరపున జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామి వెల్లడించారు.
 
ఉత్తర కర్ణాటక ప్రాంతం తెలంగాణలోని హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కర్నూలు జిల్లాలకు అనుబంధంగా ఉన్న నేపథ్యంలో పవన్‌తో ఇక్కడ ప్రచారం చేయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో కనీసం 18 స్థానాలు గెలవడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే స్టార్‌ క్యాంపెయినర్‌లుగా 'జాగ్వార్‌' హీరో నిఖిల్‌, హీరోయిన్‌ పూజాగాంధీ పేర్లు ప్రకటించామని, వారు ఉత్తర కర్ణాటకలో ప్రచారం చేస్తారని కుమారస్వామి వివరించారు.