మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 27 ఏప్రియల్ 2018 (19:49 IST)

ద్యావుడా.. శ్రీరెడ్డి గురించి మాట్లాడాలా? పరుగులు తీసిన బ్రహ్మానందం...

శ్రీరెడ్డి వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమను ఒక కుదుపు కుదిపేస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌‌ను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతుంటే ఆ విషయంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. మా అసోసియేషన్ మొత్తం ఏకమై పవన్ కళ్య

శ్రీరెడ్డి వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమను ఒక కుదుపు కుదిపేస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌‌ను టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతుంటే ఆ విషయంపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. మా అసోసియేషన్ మొత్తం ఏకమై పవన్ కళ్యాణ్‌‌కు అండగా నిలబడింది. ఇదంతా బాగానే ఉన్నా కొంతమంది నటులు మాత్రం పవన్ కళ్యాణ్‌ - శ్రీరెడ్డి వ్యవహారంపై మాత్రం ఆచితూచి స్పందిస్తున్నారు. వారి గొడవ మనకెందుకులే అన్న భావనతో కొంతమంది నటులు ఉన్నారు.
 
అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గ వ్యక్తి ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం. అలా చెప్పడానికి ఉదాహరణ కూడా ఉంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం ఆలయం బయట హడావిడి చేసేశారు. సెల్ఫీలు తీసుకుంటున్న భక్తులను ఇక్కడేముందని తీస్తున్నారు.. బట్టతల తప్ప అంటూ అందరినీ నవ్వించారు.
 
ఇంతలో మీడియా ప్రతినిధులు బ్రహ్మానందంను... సర్.. శ్రీరెడ్డి-పవన్ కళ్యాణ్‌ వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమను ఇబ్బందుల్లో పెట్టింది కదా.. ఆ విషయంపై మాట్లాడండి అనగానే బ్రహ్మానందం ఒక్కసారిగా పరుగులు ప్రారంభించాడు. వామ్మో అంటూ మీడియా కెమెరాలను తోసేసి కారెక్కి వెళ్ళిపోయారు. బ్రహ్మానందం పరుగులు పెట్టడం చూసిన భక్తులు కూడా నవ్వుకున్నారు.