జీనా యహా.. మర్‌నా యహా..
రాజ్‌కపూర్ నటించిన 'మేరా నామ్ జోకర్'లో.. ఆ పాట ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. శ్రీ 420, ఆవారా, బూట్‌పాలిష్.. చిత్రాల్లో అప్పట్లో ఆయన నటనకు ఆ చిత్రాలు మైలురాళ్ళు. బాలీవుడ్‌లో నట కుటుంబాన్ని అందించిన ఆయన 28వ వర్థంతి సందర్భంగా గురువారంనాడు ఆయన కుమారుడు రిషికపూర్ సోషల్‌మీడియాలో తన తండ్రికి నివాళులర్పిస్తూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా జీనా యహా.. మర్‌నా యహా.. అంటూ అప్పటి పాటను గుర్తు చేసుకున్నారు. కొన్ని ఫొటోలను విడుదల చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి పునాది అంటే నటుడు రాజ్ కపూర్ అని చెబితే అతిశయోక్తి కాదు. ఆయన కుటుంబం నుంచి ఎందరో నటీనటులు నేడు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏలేస్తున్నారు.