శుక్రవారం, 1 మే 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
సిహెచ్
Last Modified:
శనివారం, 3 ఏప్రియల్ 2021 (19:21 IST)
సంబంధిత వార్తలు
అదేంటో మీతో వున్న ఎంజాయ్మెంట్ వీళ్లతో రావడం లేదండీ...
పెళ్లికి ముందు నువ్వు మాత్రమే...
నిద్రపోయేటపుడు కూడా బూట్లు వేసుకుని పడుకుంటున్నావెందుకు?
ఎలక్షన్లయ్యాక ఇంకా ఎవరైనా ప్రచారం చేస్తారా..?
ఆయన మీ హస్బెండా మేడం?
లేడీ టీచర్: ఓకే పిల్లలూ... ఇవాల్టి ఆన్ లైన్ క్లాస్ అయిపోయింది. మీకేమైనా డౌట్స్ వుంటే అడిగేయండి.
పిల్లవాడు: మీరు పాఠం చెప్తున్నప్పుడు మధ్యలో చీపురు తీసుకుని ఇల్లు ఊడుస్తూ కనబడ్డాడు, ఆయన మీ హస్బెండా మేడం?
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
నలుగురు విద్యార్థులు... ఏడుగురు ఉపాధ్యాయులు... ఫలితం మాత్రం గుండు సున్నా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో అనంతపురం జిల్లాలోని గుత్తి మండలం ఊబిచర్ల గ్రామంలో ఉన్నత పాఠశాల సున్నాశాతం ఫలితాలను సాధించింది. ఈ పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులు ఉండగా ఆ నలుగురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పైగా, ఈ నలుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు పాఠాలు బోధించడం గమనార్హం. చివరకు సున్నా శాతం ఫలితంతో అపకీర్తిని మూటగట్టుకుంది.
సత్తా చాటిన తల్లీ కొడుకులు.. అమ్మకు 360, తనయుడికి 562 మార్కులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో ఈస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన తల్లీకొడుకు సత్తాచాటారు. వీరిద్దరూ ఒకేసారి పదో తరగతి పరీక్షలు రాసి, ఒకేసారి పాసయ్యారు. పైగా, ఈ పరీక్షల్లో తల్లికి 360 మార్కులు రాగా, తనయుడు మాత్రం రికార్డు స్థాయిలో 600 మార్కులకు గాను 562 మార్కులు సాధించాడు.
ఈవీఎంలను తారుమారు చేయాలని చూస్తే చావునైనా లెక్క చేయను : మమతా బెనర్జీ వార్నింగ్
వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను అటు అధికార తృణమూల్ కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీజేపీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో భాగంగా, బెంగాల్ ఎన్నికల పోలింగ్ రెండు దశల్లో ముగిసింది. మే నెల 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే, పోలింగ్ ప్రక్రియ పూర్తయినప్పటి నుంచి రాష్ట్రంలో మాత్రం ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. పలు చోట్ల స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్‌లు తెరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికార తృణమూల్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ నేతలకు తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈవీఎంలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియను తారుమారు చేయాలని చూస్తే చావునైనా లెక్క చేయకుండా పోరాడుతానని హెచ్చరించారు.
పదో తరగతి పరీక్షల్లో ఒకేసారి పాసయిన తల్లీకొడుకులు
పదో తరగతి పరీక్షల్లో ఒకేసారి ఆ తల్లీకొడుకులు ఉత్తీర్ణులయ్యారు. దీనితో ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పూలపల్లికి చెందిన బండారు లక్ష్మీ లహరి అనే మహిళ కొన్ని కారణాల వల్ల పదో తరగతి పరీక్షలు రాయలేకపోయింది. వ్యక్తిగత కారణాల వల్ల ఆరో తరగతిలోనే చదువు ఆపేసింది. తన కుమారుడు పదో తరగతి చదువుతుండగా అతడితో పాటు ఓపెన్ స్కూలు ద్వారా ఆమె కూడా టెన్త్ చదివింది. రిజల్ట్స్ రావడంతో ఎంతో ఉత్కంఠగా తను పాసయ్యానా లేదా అని ఎదురుచూసింది. కుమారుడికి 600కి 562 మార్కులు రాగా తల్లి లహరికి 360 వచ్చాయి.
పెళ్లి మండపంలో వరుడికి దండ వేయకుండా ప్రియుడికి వేసి హత్తుకుంది, రచ్చరచ్చ వీడియో
పెళ్లి మండపంలో ఓ వధువు తనకు కాబోయే భర్త మెడలో దండ వేయకుండా మండపం కింద నిలబడి ఆమెనే దీనంగా చూస్తూ వున్న ప్రియుడి మెడలో వేసేసింది. దాంతో అక్కడి వారంతా షాక్ తిన్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛింద్వాడాలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఛింద్వాడాలో పెళ్లి వేడుక ఘనంగా జరుగుతోంది. వివాహ తంతు ముగియనున్న సమయంలో వధువు కాబోయే భర్త మెడలో దండ వేసేందుకు సిద్ధమవుతోంది. ఇంతలో వేదిక వద్ద ఆమెకి తన ప్రియుడు కనిపించాడు. అంతే... దండను తీసుకుని వేదిక దిగి పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ దండను అతడి మెడలో వేసేసి హత్తుకున్నది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే?
రాగులు. వీటిలో క్యాల్షయం పుష్కలంగా వుంటుంది. ఐతే మొలకెత్తిన రాగులను ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అవేమిటో తెలుసుకుందాము. శరీరంలో ఇనుము శోషణకు మొలకెత్తిన రాగులు దోహదం చేస్తాయి. మెరుగైన జీర్ణక్రియ కోసం అధిక ఫైబర్ కంటెంట్ వీటి ద్వారా లభిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలో కాల్షియం శోషణను పెంచడంలో పాత్ర వహిస్తుంది. గ్లూటెన్ రహిత ఆహారం కావాలంటే మొలకెత్తిన రాగులను తీసుకుంటుండాలి. మొలకెత్తిన రాగుల ఆహారం పాలిచ్చే తల్లుల్లో చనుబాలు వృద్ధి చెందేట్లు చేస్తుంది. అదనపు కిలోల బరువు తగ్గడానికి ప్రయత్నించేవారు మొలకెత్తిన రాగులను తినవచ్చు.
Leg Cramps, బీరకాయ తింటే కొందరికి పిక్కలు పడతాయి, ఎందుకు?
కొందరికి బీరకాయలు పడవు అంటారు. ముఖ్యంగా బీరకాయ తిన్నప్పుడు పిక్కలు పట్టేయడం (Leg Cramps) అనేది అందరికీ జరిగే విషయం కాదు. కొంతమందిలో ఇది జరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మన పెద్దలు చెప్పే చలవ చేయడం లేదా వాయువు అనే అంశాలు దీని వెనుక ఉన్నాయి. బీరకాయ శరీరానికి అమితమైన చలవ చేస్తుంది. ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం ప్రకారం, శరీరం అతిగా చల్లబడినప్పుడు రక్త ప్రసరణలో వేగం తగ్గి, కండరాలు ముఖ్యంగా కాళ్ళ పిక్కలు బిగుసుకుపోయే అవకాశం ఉంటుంది. అలాగే బీరకాయలో నీటి శాతం చాలా ఎక్కువ. ఇది నేచురల్ డ్యూరెటిక్గా పనిచేస్తుంది.
వేసవిలో గోండ్ కతీరా చప్పరిస్తుంటే ఎంత మేలు చేస్తుందో తెలుసా?
గోండ్ కతీరా. దీని గురించి చాలామందికి తెలియదు కానీ కొన్ని గ్రామాల్లో దీని వాడకం బాగానే చేస్తుంటారు. ప్రత్యేకించి వేసవిలో దీన్ని తింటుంటారు. ఈ గోండ్ కతీరా (Gond Katira), దీనినే తెలుగులో గోధుమ బంక అని కూడా అంటారు, ఇది ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఆరోగ్య సంపద. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి కాలంలో ఇది శరీరానికి ఒక నేచురల్ కూలర్లా పనిచేస్తుంది. దీనిలోని ప్రధాన ఆరోగ్య రహస్యాలు మరియు ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము. గోండ్ కతీరాలో అద్భుతమైన చల్లబరిచే గుణాలు ఉన్నాయి. ఎండ దెబ్బ (Heat Stroke) తగలకుండా ఇది కాపాడుతుంది.
శరీర కండరాలు పెంచే ఆహార పదార్థాలు ఇవే
శరీర కండరాలను పెంచుకోవడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. కండర ద్రవ్యరాశిని పెంచడానికి మీరు తినగలిగే ఎనిమిది కండరాలను పెంచే ఆహారాలు ఏమిటో తెలుసుకుందాము. కోడిగుడ్లు మాంసకృత్తుల నుండి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి, బి12, బి6, థయామిన్ విటమిన్ల శక్తివంతమైన మిశ్రమాన్ని కలిగి ఉంటాయి. ఇప్పటికే ఆహారంలో తగినంత కొవ్వును కలిగి ఉంటే, ప్రోటీన్ తీసుకోవడం పెంచడానికి అవసరమైతే చేపలు తినవచ్చు. బాదం పప్పులు, వాల్నట్లను మితంగా తింటుంటే కండరాలను నిర్మించడానికి అద్భుతమైన ఎంపిక. అమైనో ఆమ్లాలు కలిగిన సోయాబీన్స్ తింటుంటే కండరాలను పెంచుకునే అవకాశం వుంటుంది.
వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?
వేసవి తాపానికి మజ్జిగ మందు లాంటిది. మండు వేసవిలో అలా బయటకు వెళ్లివచ్చినప్పుడు ఓ గ్లాసుడు మజ్జిగ తాగితే ప్రాణం లేచి వచ్చినట్లుంది. మజ్జిగా తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. మజ్జిగలో వుండే విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మజ్జిగ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. మజ్జిగలో ఉండే రిబోఫ్లావిన్ శరీరం యొక్క శక్తి ఉత్పత్తి వ్యవస్థలకు కీలకమైనది. మజ్జిగ తాగడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతాయి. మజ్జిగ బీపీని తగ్గిస్తుంది, తద్వారా రక్తపోటు- గుండె జబ్బులతో బాధపడుతున్నవారికి మేలు చేస్తాయి. ఆహారంలో మజ్జిగను తీసుకుంటే కాల్షియంను జోడిస్తుంది. మజ్జిగలోని తక్కువ కేలరీలు, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.