శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By DV
Last Modified: శుక్రవారం, 17 మార్చి 2017 (17:02 IST)

పూరీ తమ్ముడు 'నేనోరకం'... రివ్యూ రిపోర్ట్

తెలుగు సినిమాల్లో హీరోగా నిలబడాలనుకునే సాయిరాం శంకర్‌ చేసిన చిత్రాలు అంతగా పేరు తేలేకపోయాయి. పూరీ సోదరుడిగా గుర్తింపు వచ్చినా తనను తాను నటుడిగా ఆవిష్కరించుకున్నా పూర్తిస్థాయి హీరోగా కాలేకపోయాడు. అయితే తెలుగు, తమిళ భాషల్లో ఈసారి తన టాలెంట్‌ను నిరూపించ

నేనోరకం చిత్రం నటీనటులు: సాయిరాం శంకర్‌, శరత్‌ కుమార్‌, రేష్మీ మీనన్‌, కాశీ విశ్వనాథ్‌, వైవా హర్ష; సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్‌ రామస్వామి, సంగీతం: మహిత్‌ నారాయణ్‌, నిర్మాత: శ్రీకాంత్‌ రెడ్డి, దర్శకుడు: సుదర్శన్‌ సలేంద్ర.
 
తెలుగు సినిమాల్లో హీరోగా నిలబడాలనుకునే సాయిరాం శంకర్‌ చేసిన చిత్రాలు అంతగా పేరు తేలేకపోయాయి. పూరీ సోదరుడిగా గుర్తింపు వచ్చినా తనను తాను నటుడిగా ఆవిష్కరించుకున్నా పూర్తిస్థాయి హీరోగా కాలేకపోయాడు. అయితే తెలుగు, తమిళ భాషల్లో ఈసారి తన టాలెంట్‌ను నిరూపించుకునేందుకు ప్రయత్నించాడు. అదే 'నేనో రకం'. తమిళ సీనియర్‌ నటుడు శరత్‌కుమార్‌తో కలిసి ఓ డిఫరెంట్‌ కథ, కథనంతో ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
 
కథ :
ఓ ఫైనాన్స్‌ కంపెనీలో రికవరీ ఏజెంట్‌గా పనిచేసే గౌతమ్‌ (సాయిరాం శంకర్‌), స్వేచ్ఛ (రేష్మీ మీనన్‌)  ప్రేమలో పడతాడు. ఆమెకు మరింత దగ్గరయ్యేందుకు అబద్ధాలు ఆడేస్తాడు. గౌతమ్‌ చెప్పినవన్నీ అబద్ధాలని తెలిసి మొదట ఛీదరించుకుంటుంది. ప్రేమను పొందడానికే అలా చేశాడని చెప్పాలనుకున్న గౌతమ్‌కు అనుకోని సంఘటన ఎదురవుతోంది. అది ఏమిటి? మరి గౌతమ్‌ ప్రేమ గెలిచిందా? లేదా మద్యలో మరొకరు అడ్డుపడ్డాడా? అన్నది మిగిలిన కథ.
 
పెర్‌ఫార్మెన్స్‌:
గౌతమ్‌ క్యారెక్టర్‌ చేసిన సాయిరాం శంకర్‌ తన కెరీర్‌లో ప్రత్యేక పాత్ర చేశాడు. క్యారెక్టర్‌లోని పలు కోణాల్ని చూపించే అవకాశం ఇందులో దక్కింది. శరత్‌ కుమార్‌కు తోడు స్వేచ్ఛ క్యారెక్టర్‌ చేసిన రేష్మీ మీనన్‌ తన పాత్రను న్యాయం చేసింది. మిగిలిన పాత్రలకు కథకు సరిపోయేవి.
 
సాంకేతికత
సినిమాలో హోళీ సీన్‌, ఫైటింగ్‌ సీన్లలో సినిమాటోగ్రఫీ సిద్దార్ద్‌ బాగా చూపించాడు. దీనికితోడు బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అతికినట్లుంది. దర్శకుడు మాత్రం సినిమా ద్వితీయార్థాన్ని చాలా బాగా హ్యాండిల్‌ చేశాడు. ఆకట్టుకునే కథనం, తగ్గట్టుగానే సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్‌ రీ-రికార్డింగ్‌ బాగా చేశాడు. నిర్మాణాత్మక విలువలు పర్వాలేదు.
 
విశ్లేషణ: 
బలమైన కథతో పాటు అంతే బలంగా కథనాన్ని చెబుతూ ప్రేక్షకుల్లో ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌ మిస్‌ అవకుండా తీసిన సినిమా ఇది. సాయిరాం శంకర్‌ తొలిసారిగా '143'ని ఎంత ఇష్టంతో చేసినట్లు కనిపించాడో అదేవిధంగా ఇందులోనూ తన నటనలోని పరిపక్వతను స్క్రీన్‌పై చాలా బాగా చూపించాడు. ధియేటర్లకొచ్చి సినిమాలు చూసే ఆడియెన్స్‌ సంఖ్య బాగా తగ్గింది. ఎప్పుడైనా కథాబలం వున్న చిత్రాలు ఆకర్షణీయంగా చూపించే విధానంతో ఆకట్టుకుంటాయి. శ్రీమంతుడు, పెళ్లి చూపులు అలాంటివే. ఇప్పుడదే కోవలో ఈ చిత్రం చేరుతుంది. శరత్‌కుమార్‌ నటన సెకండాఫ్‌కి హైలెట్‌గా నిలిచి మరో మెట్టుకు చేరేలా చేసింది.
 
సమాజంలో జరుగుతున్న చాలా సమస్యల్లో కొన్నింటిని తనదైన బాణీలో గౌతమ్‌ క్యారెక్టర్‌ ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నించిన విధానం ఆకట్టుకుంది. అసలు ఏం జరుగుతుందో తెలియక గౌతమ్‌ పాత్ర ఎంత ఉద్విగ్నతకు లోనవుతుందో సెకండాఫ్‌లో థియేటర్లో ఉన్న ప్రేక్షకుడు సేమ్‌ అదే ఫీల్‌ అవుతారు. 
 
రొటీన్‌గా సీరియస్‌గా సాగే కథకు స్పీడ్‌బ్రేకుల్లా ఉన్న రెండు పాటలు అడ్డుకుంటాయి. ఇంటర్వెల్‌కు ఇంకా కాస్త ముందు నుంచి కథ కాస్త సీరియస్‌ మోడ్‌లో ముందుకు వెళ్తే బాగుండేది అనిపించింది. దర్శకుడు సుదర్శన్‌ సాలేంద్ర సందేశాత్మకమైన పాయింట్‌ను డిఫరెంట్‌గా డీల్‌ చేసి ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్‌ విషయంలో కాస్త విఫలమైనా సెకండాఫ్లో మాత్రం మ్యాగ్జిమమ్‌ మార్కులు దక్కించుకున్నాడు. సెకండాఫ్‌లో నడిచే సన్నివేశాల్లో కెమెరా వర్క్‌ రియలిస్టిక్‌గా ఉండి ఆకట్టుకుంది. సస్పెన్స్‌తో కూడిన సెకండాఫ్‌ డ్రామా, శరత్‌ కుమార్‌, సాయి రామ్‌ శంకర్‌ నటన, హీరోయిన్‌ రేష్మి మీనన్ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఈ సినిమాలో మెప్పించే అంశాలు కాగా చాలావరకు అనవసరమైన సన్నివేశాలతో నిండిన ఫస్టాఫ్‌ ఇందులో ప్రధాన బలహీనత. మొత్తంమీద కాస్త సాగదీసినట్టు ఉండే ఫస్టాఫ్‌‌ను తట్టుకోగలిగితే మంచి స్టోరీ లైన్‌, సస్పెన్స్‌ డ్రామా కలిగిన ఈ చిత్రం తప్పక మెప్పిస్తుంది.
 
రేటింగ్ ‌: 3/5