తారాగణం- జూనియర్ ఎన్.టి.ఆర్,రామ్ చరణ్, అలియా భట్, అజయ్‌దేవ్ గన్, రాజీవ్‌కనకాల తదితరులు; సాంకేతికత- ఛాయాగ్రహణం- కె.కె.సెంథిల్ కుమార్, కూర్పు-అక్కినేని శ్రీకర్ ప్రసాద్, సంగీతం-ఎం. ఎం. కీరవాణి, నిర్మాణ సంస్థ- డివివి ఎంటర్టైన్మెంట్స్, కథ-కె. వి. విజయేంద్ర ప్రసాద్, దృశ్య రచయిత- ఎస్. ఎస్. రాజమౌళి, నిర్మాత- డివివి దానయ్య, దర్శకత్వం- ఎస్.ఎస్.రాజమౌళి
విడుదల తేదీ- 2022,మార్చి 25, శుక్రవారం.
రాజమౌళి నుంచి నాలుగేళ్ళపాటు మెరుగులు దిద్దుకున్న రౌద్రం రణం రుధిరం (ఆర్.ఆర్.ఆర్.) ఎట్టకేలకు ఈ శుక్రవారమే థియేటర్‌లలో విడుదలైంది. జూనియర్ ఎన్.టి.ఆర్,రామ్ చరణ్, అలియా భట్, అజయ్‌దేవ్ గన్ ప్రముఖ తారాగణం నటించిన ఈ సినిమా అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు బతికివుంటే వారు స్నేహితులుగా వుంటే ఎలా వుంటుందనే ఊహాజనిత కథగా దర్శకుడు తెరకెక్కించాడు. 2004లో విడుదలైన బ్రెజిల్ సినిమా `మోటార్‌సైకిల్ డైరీస్` చిత్ర ఆర్.ఆర్.ఆర్.కు స్పూర్తి. విప్లవ నాయకుడు చే గువేరాగా అతని స్నేహితుడు మోటార్ సైకిల్‌పై దేశమంతా తిరిగే నేపథ్యంతో ఆర్.ఆర్.ఆర్. రూపొందింది. మరి ఈ సినిమా ఎలా వుందో తెలుసుకుందాం.
కథ
1920 నాటికథ. ఇండియాను బ్రిటీష్ వారు పాలిస్తున్న కాలం. విశాఖలోని గిరిజన ప్రాంతంలో గోండు తెగలుండే ప్రాంతానికి బ్రిటీష్ దొరసాని బలగంతో వస్తుంది. అక్కడి చిన్నపిల్ల మల్లిని దొరసాని చేతిపై వేసిన డ్రాయింగ్‌కు విలువ ఇచ్చి తనతోపాటు ఢిల్లీ తీసుకెళుతుంది. ప్రాథేయపడిన మల్లి తల్లిని కొట్టి తీసుకెళతారు. ఆ తర్వాత మల్లి బానిసలా రాజభవంతిలో వుండాల్సివస్తుంది. బయటప్రపంచం తెలీదు. కాలక్రమేణా గోండు జాతిలో యువకుడు భీమ్ (ఎన్.టి.ఆర్.) మల్లికోసం మారువేషంలో ముస్లింపేరుతో అక్కడ బైక్ మెకానిక్‌గా చేరతాడు. రాజభవనంలో ఎలా వెల్ళాలనే ప్లాన్ వేస్తుండగా దొరసాని కుమార్తె పరిచయం కావడం ఆ తర్వాత లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఈలోగా బ్రిటీష్ పోలీస్ అధికారి రామ్ (రామ్‌చరణ్) భీమ్ కోసం వెతుకుంటాడు. పట్టకుంటే ప్రమోషన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతుంది. అలా ఇద్దరూ ఓ సందర్భంలో కలుస్తారు. కానీ ఎవరు ఏమి చేస్తున్నారో తెలీదు. ఫైనల్‌గా భీమ్‌ను బ్రిటీష్ గవర్నర్‌కు అప్పగిస్తాడు. ఆ తర్వాత రామ్‌కు స్పెషల్ ఆఫీసర్‌గా ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత జరిగిన సంఘటనలతో రామ్‌కు కనువిప్పు కలుగుతుంది. ఆ తర్వాత రామ్ ఏం చేశాడు? భీమ్‌ను కాపాడాడా? లేదా? అనేది సినిమా.
విశ్లేషణః
ఈ కథ 1920నాటిది. మనకు స్వాతంత్రం రాకముందు. దానికోసం ప్రజలు పోరాడుతున్న అందులో గోండు జాతులు ఏవిధంగా పోరాడారు. ఢిల్లీ ప్రజలు ఏవిధంగా వారికి బాంచాత్ నీ కాలుమొక్కుతా? అన్నారు. ఇవన్నీఇందులో క్లారిటీగా చూపించాడు. రాజమౌళి కథ అనుకున్నప్పుడు ఆంధ్ర, తెలంగాణ విడిపోయాయి. ఆ టైంలో ఆంధ్ర, తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులను కలిపి సినిమా తీస్తే ఎలా వుంటుందనే ఆలోచనలోంచి వచ్చిన కథ. అయితే దీనికి స్పెయిన్ సినిమా మోటార్ సైనిక్ స్టోరీస్ స్పూర్తి అన్నాడు. కానీ పబ్లిసిటీ పేరుతో ఆయన తప్పుదోవ పట్టించాడని అర్థమయింది. ఆ కథకు దీనికి సంబంధం లేదు. కేవలం ఇద్దరు స్నేహితులు అనే పాయింట్‌తో మార్కెటింగ్ పరంగా వేసిన ఎత్తుగడ.
మొదటి భాగం చాలా ఆసక్తికరంగా సరదాగా సాగుతుంది. రెండో భాగం కేవలం భీమ్‌ను ఎలా రక్షిస్తాడనే కోణంలో వుంటుంది. అయితే కథలో ఎక్కడా ఉత్సుకత కనిపించదు. కథలో అసలైన పాయింట్ లోపంతో ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. కేవలం విజువల్ వండర్స్, గ్రాఫిక్స్ వల్ల ఆకట్టుకునేలా రాజమౌళి చేశాడు. ఇందులో ఎన్.టి.ఆర్., రామ్‌చరణ్ పోటాపోటీగా బాగా నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో జీవించారనే చెప్పాలి. వారి కష్టం వెండితెరపై బాగా కనిపించింది.
పాటలు అంతగా ఆకట్టుకోలేదు..
జల్, జంగల్, జమీన్.. కోసం పోరాటం అన్నట్లుగా ముగింపు ఓ సాంగ్ వస్తుంది. కానీ అది పెద్దగా కిక్ ఇవ్వదు.
- నాటునాటు అనే సాంగ్.. ఉక్రెయిన్ రాజభవనంలో తీశారు. అది నాచురల్‌గా వుంది.
- వాటర్ ఫైట్స్‌ను నెదర్లాండ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ సోల్‌మన్ బాగా చేశాడు.
- టైగర్ సీక్వెన్స్ బల్గేరియాలో చేశారు. అడవిలో ఎన్.టి.ఆర్. జంతువుల వేటకోసం వెళితే అనుకోకుండా పులి రావడం ఎటాక్ చేయడం సీన్స్ అద్భుతంగా వచ్చాయి. ఇందులో రామారావు రన్నింగ్ కష్టం కనిపించింది.
- ఇంటర్ వెల్ బ్లాక్ అదిరిపోయింది. భీమ్ పులి, లేడీ, వంటి జంతువులతో దాడిచేసే విధానం చూడడానికి బాగుంది.
- రామ్ చరణ్.. ప్రారంభంలో దొర చెప్పినట్లుగా ప్రజలు ఎదురుతిరిగితే వారిని కొట్టి మరీ కంట్రోల్ చేసే విధానం రామోజీ ఫిలింసిటీలోని అటవీ ప్రాంతంలో చేశారు. అందులో చరణ్ యాక్షన్ కష్టం కనిపించింది.
- వందలాది మందికి అప్పటి ప్రజలు ధరించే తలకు టర్పన్‌లుతో సహజంగా చిత్రీకరించారు.
- ఇంటర్వూలో రకరకాలుగా హైలైట్ చేసిన రాజమౌళి సినిమాలో అజయ్‌దేవగన్, అలియా భట్ పాత్రలు పరిమితంగానే వున్నాయి.
కేవలం గ్రాఫిక్స్, విజువల్ వండర్‌గానే సినిమా వుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో బాహుబలి ఛాయలు కనిపిస్తాయి. భటులు వెంబడిస్తే ప్రభాస్ కోటనుంచి బయటకు వెళ్లే సన్నివేశం తరహాలో భీమ్.. ఢిల్లీ రాజభవనంలోంచి బయటకు రావడం, రానా, ప్రభాస్.. విగ్రహం ముందు ఫైట్ సీన్.. తరహాలో ఎన్.టి.ఆర్. రామ్‌చరణ్ యాక్షన్ ఎపిసోడ్ సింక్ అవుతాయి.
ముగింపు..
భీమ్, అల్లూరి సీతారామరాజు అనే పేర్లను కేవలం మార్కెటింగ్ ప్రకారం పెట్టినట్లుగా వుంది. కథలో ఆ పేర్లు వున్నా లేకపోయినా పర్వాలేదు అనిపిస్తాయి. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళకు పైగా అయిన సందర్భంగా ప్రముఖ దినపత్రికలలో రకరకాలుగా ఒక్కో ప్రాంతంలో పోరాట యోధుల గురించి కథలు రాస్తున్నారు. కనీసం అందులో ఒక కథ అయినా తీసుకుంటే బాగుండేదనిపిస్తుంది.
కేవలం ఊహాజనితమైన కథ తీసుకుని తనకు తెలిసిన టెక్నికల్ గ్రాఫిక్‌తో మాయ చేశాడు. ఇప్పటికే పబ్లిసిటీవల్ల పెట్టిన 450కోట్లకు వారం రోజుల్లో వస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ కమర్షియల్‌గా లాంగ్ రన్ కష్టమే అనిపిస్తుంది.
- మల్లి అనే గోండు పిల్లను బలవంతంగా తీసుకెళ్లి వారు ఆమెకు వచ్చిన కళను ఆస్వాదిస్తారు. కానీ ఎక్కడా ఈ పాయింట్‌కు ఫీలింగ్ రాదు. కథలో బలమైన అంశం లేకపోవడంతో సెకండాఫ్ చాలా డల్‌గా మారింది. బాహుబలి తరహాలో ఈ సినిమా పేరు తెచ్చుకోవడం కష్టమని చెప్పకతప్పదు.
రేటింగ్- 3/5