థ్రిల్ కలిగించే `కపటధారి`- రివ్యూ
నటీనటులుః సుమంత్, నందిత శ్వేత, నాజర్, సుమన్‌రంగనాథ్, వెన్నెల కిశోర్ తదితరులు.
సాంకేతికతః కెమెరాః రసమతి, సంగీతంః సిమన్ కె.కింగ్, నిర్మాతలుః లలిత ధనంజయన్, దర్శకత్వంః ప్రదీప్ కృష్ణమూర్తి.
సుమంత్ ఈమధ్య భిన్నమైన కథలను ఎంపికచేసుకుంటున్నాడు. తాజాగా ఆయన నటించిన సినిమా `కపటధారి`. ఇది కన్నడ సినిమా కలువధారికి రీమేక్ అయినా తెలుగులో సుమంత్ నటిస్తే ఎలా వుంటుందో చూద్దాం.
కథః
ట్రాఫిక్ ఎస్.ఐ. గౌతమ్ (సుమంత్). కానీ తనకు క్రైం డిపార్ట్‌మెంట్ అంటే చాలా ఇష్టం. పరిస్థితి బాగోలేక ట్రాఫిక్‌లోనే వుండిపోయాడు. కానీ. లోపల వున్న బలమైన కోరిక వుంటుంది. ఓరోజు మెట్రో పనుల్లో మూడు కపాలాలు బయట పడతాయి. కానీ క్రైం డిపార్ట్‌మెంట్ దాన్ని మూసేలా ఏదో ఒకటి చేయాలను చూస్తుంది. ఎప్పుడో 40 ఏళ్ళనాటి పుర్రెలతో ఏం చేస్తాం అనేలా వున్న ఆ కేసును తను స్వయంగా గౌతమ్ డీల్ చేసి క్లూ సంపాదిస్తాడు. అది ఏమిటి? ఎలా? అనేది సినిమా.
విశ్లేషణః
తన కిష్టమైన పని చేయాలనుకునే పోలీసుగా సుమంత్ పాత్ర బాగుంది. గతంలో చేసిన భిన్నమైన పాత్రలకు ఇది కూడా భిన్నమైనదే. ఇందులో స్రీన్‌ప్లే ఆసక్తికరంగా వుంటుంది. తమిళ నటుడు జయప్రకాష్ నటన ద్వితీయార్థంలో బాగుంది. పురావస్తు శాఖలో లభించిన ఓ విషయాన్ని దాని చుట్టు పక్కల అల్లుకున్న కథ, కథనంలో ఈ చిత్రం ఆసక్తికరంగా వుంటుంది. మొదటి భాగంలో ఏమంత బాగుంది అన్నట్ల అనిపించినా సెకండాఫ్‌లో మాత్రం రక్తి కట్టిస్తుంది. నందిత శ్వేత పాత్ర పరిమితి మేరకు నటించింది. సి.ఎం.గా చేసిన నటుడు స్టయిలిష్‌గా బాగా అలరించాడు.
రాజకీయ నాయకులు ఎలా ఎదుగుతారు. ఎదిగాక వారు ఎటువంటి చర్యలకు పాల్పడుతారనే కోణంలో పలు సినిమాలు వచ్చినా కపటధారి అందుకు భిన్నమైందిగా వుంటుంది. ఎక్కడా పాటలకు అవకాశం లేకుండా కథ, కథనంతో అలరించే సినిమా ఇది. అయితే ట్రాపిక్ కానిస్టేబుల్ క్రైం కేసును పరిశోధించే క్రమంలో టెక్నికల్‌గా కొన్ని అడ్డంకులు వుంటాయి. అవి ఇందులో ఎక్కువ చూపించలేకపోయాడు దర్శకుడు. కెమెరాపరంగా, సంగీతపరంగా మంచి మార్కులే పడ్డాయి. ఈ థ్రిల్లర్ సినిమాకు చివరి 20 నిముషాలు బాగా ఆకట్టుకుంది. అదే సినిమాకూ బలం కూడా. ముగింపు కూడా దర్శకుడు బాగా లింక్ చేశాడు.
రేటింగ్ః 2.5/5