అదృష్టం ఆవగింజంత ఉంటే.. దురదృష్టం... నవ్వులు పూయిస్తున్న "భీష్మ" టీజర్

bheesma still
ఠాగూర్| Last Updated: ఆదివారం, 12 జనవరి 2020 (10:50 IST)
టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ. రష్మిక మందన్నా హీరోయిన్. దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

ఇటీవ‌ల చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్స్ ప్రేక్ష‌కుల‌లో ఆస‌క్తిని క‌లిగించాయి. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఈ టీజ‌ర్‌ ప్రేక్ష‌కుల‌కి థ్రిల్ క‌లిగిస్తుంది. కూల్ అండ్ ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉన్న టీజ‌ర్ సినిమాపై ఆస‌క్తిని క‌లిగిస్తుంది.

ఈ టీజర్‌ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. పూర్తిగా కామెడీలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, హీరో నితిన్ వేసే ప్రతి పంచ్ డైలాగ్ నవ్వు తెప్పిస్తోంది. అదృష్టం ఆవగింజంత ఉంటే.. దురదృష్ణం తంబకాయంత ఉందంటూ, ఇలా అనేక పంచ్ డైలాగులు ఉన్నాయి. ఈ టీజర్‌పై మీరూ ఓ లుక్కేయండి.





దీనిపై మరింత చదవండి :