శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. అడ్రస్ డైరీ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 సెప్టెంబరు 2019 (14:25 IST)

బిగ్ బాస్ మూడో సీజన్‌.. జీవితంలో నాలుగు రాళ్ళు ప్రోమో.. (video)

బిగ్ బాస్ మూడో సీజన్‌‍లో ఇన్నాళ్లు చప్పగా సాగింది. అసలు గేమ్ ఇప్పుడే మొదలైంది. తాజాగా గేమ్ షోలో భాగంగా రాహుల్, వరుణ్‌ల మధ్య జరిగిన గొడవతో కొత్త మలుపు తీసుకుంది. ఆనాటి నుండి ప్రతీ రోజు గేమ్‌లో సరికొత్త మజా వస్తుంది. కంటెస్టెంట్స్ కూడా తమ మాస్క్ తీసేసి గేమ్ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది. అయినా ఇంకొందరు కంటెస్టెంట్స్ మాస్క్ వేసుకునే ఉన్నారు. అయితే వాళ్ళు మాస్క్ తీసేస్తారా లేదా అనేది అనుమానమే.
 
ఇకపోతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన రవికృష్ణ ఇంటి నుండి వెళ్ళిపోవడం కొంత బాధాకరం. ఈ సారి మరింత కొత్తగా టీంలుగా డివైడ్ చేయకుండానే ఎవరి ఆట వారే ఆడేలా చేస్తున్నాడు బిగ్ బాస్. జీవితంలో నాలుగు రాళ్ళు సంపాదించుకోవాలి మాట వరసకి అంటుంటారు. అయితే ఆ మాటలని బిగ్ బాస్ సభ్యులు సీరియస్‌గా తీసుకున్నారు. 
 
బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ వల్ల సభ్యులందరూ నాలుగు రాళ్ళు సంపాదించుకునే పనిలో పడ్డారు. గార్డెన్ ఏరియాలో బిగ్ బాస్ రాళ్ళు పడేస్తాడు. సభ్యులందరూ ఆ రాళ్ళలోంచి విలువైన రాళ్ళను ఏరుకుని దాచుకోవాలి. అయితే ఎవరి దగ్గరైతే ఎక్కువ విలువ గల రాళ్ళు ఉంటాయో వారు నామినేషన్‌లో నుండి తప్పించుకుంటారట. తక్కువ విలువ గల రాళ్ళు ఉన్నవారు నామినేషన్ లోకి వెళ్తారు. తాజాగా విడుదలైన ప్రోమో నెట్టింటిని షేక్ చేస్తోంది. 
 
ఇకపోతే.. ఆదివారం టాస్కుల తరవాత రవి ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తరవాత రవికి నాగార్జున ఒక చేదు-తీపి టాస్క్ ఇచ్చారు. ముందుగా 9వ నంబర్ వద్ద పునర్నవి ఫొటోను రవికృష్ణ పెట్టాడు. ఆమె చేత 9 చేదు లడ్డూలు తినిపించాడు. ఆ తరవాత వితికాతో ఎనిమిది, మహేష్‌తో ఏడు, రాహుల్‌తో ఆరు లడ్డూలు తినిపించాడు రవి. 
 
ఆ తరవాత 5వ ర్యాంక్ నుంచి తీపి లడ్డూలు మొదలయ్యాయి. బాబా భాస్కర్‌కు 5, శ్రీముఖికి 4, వరుణ్ సందేశ్‌కు 3, అలీ రెజాకు 2, శివజ్యోతికి 1వ ర్యాంక్ ఇచ్చి వారితో తీపి లడ్డూలు తినిపించాడు. ఈ సమయంలో ఒక్కొక్కరి గురించి రవి వివరిస్తూ వచ్చాడు. అలీ, శివజ్యోతిల గురించి చాలా మంచిగా చెప్పి వాళ్లను ఏడిపించేశాడు.
 
ఎప్పటిలానే ఆఖరిగా రవి చేతికి నాగార్జున బిగ్ బాంబ్ ఇచ్చారు. ఈ బిగ్ బాంబ్‌ను రవి.. పునర్నవి మీదికి విసిరాడు. ఇంతకీ ఆ బాంబ్ ఏమిటంటే.. బిగ్ బాస్ చెప్పేంత వరకు ఇంటి సభ్యుల బట్టలన్నీ పునర్నవి ఉతకాలి. బిగ్ బాస్ ఎప్పుడు చెబితే అప్పుడు ఈ బాంబ్‌ను పునర్నవి ఆపేయొచ్చు.