ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (17:45 IST)

బాబా భాస్కర్‌కి కూతురిగా పుట్టివుంటే బాగుండేది (video)

ఆదివారం మాత్రం షో చాలా సరదాగా నడిచింది. సండే ఫన్‌డే అంటూ హౌస్‌మేట్స్‌కు కొత్త గేమ్స్ ఇచ్చి ప్రేక్షకులకు వినోదం పంచారు. అలాగే, ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన పునర్నవి, రాహుల్, తమన్నా, బాబా భాస్కర్, వితికా షెరులలో ఒక్కొక్కరిని సేఫ్‌ జోన్‌లో వేస్తూ చివరిగా తమన్నా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు.


షో నుంచి బయటికి వెళ్లిపోతూ తమన్నా కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే, ఆ కన్నీళ్లు కేవలం బాబా భాస్కర్ కోసం మాత్రమే. ఆయన లాంటి తండ్రి తనకూ ఉంటే బాగుండని తమన్నా అన్నారు.  
 
బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తమన్నా ఎంతో జోష్‌తో వేదికపైకి వచ్చారు. నాగార్జున నోటి వెంబడి తన పేరు రావడం తన అదృష్టమని తమన్నా అన్నారు. బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టడం తన కల అని ఆ కల నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు.


అయితే, బాబా భాస్కర్ విషయంలో ఆమె కాస్త ఎమోషన్ అయ్యారు. ''నా తల్లి, నా తండ్రి, నా గురువు అన్నీ బాబా భాస్కర్. నిజంగా బాబా భాస్కర్‌కే నేను పుట్టుంటే సూపర్ లేడీ అయ్యేదాన్ని" అని తమన్నా కంటతడి పెట్టుకున్నారు.