దర్శకత్వం కన్నా ఆ అమ్మణ్ణి పొగడలేక చచ్చా... పూరీ జగన్నాథ్.. ఎవరా అమ్మడు?
మనిషన్నాక ఏదోక వీక్ నెస్ ఉంటుంది. కొందరు తిడితే పని చేస్తారు. కొందరు డబ్బులిస్తే పని చేస్తారు. అలాగే ఓ అమ్మడినికి పొగడాలట. పొగిడితే గానీ బుట్టలో పడదట. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా.. ప్రముఖ దర్శకుడు పూరిజగన్నాథ్ ఓ అమ్మడిని బుట్టలో వేయడానికి దర్శకత్వం వదిలేసి పొగిడే పనిలో పడ్డాట. అబ్బో దర్శకత్వం కంటే పొగడడమే చాలా కష్టం.. అని అన్నాడు.. ఇంతకీ ఆ అమ్మడు ఎవరిని అడిగితే చార్మీ వైపు వేలెత్తి చూపాడు. నటీనటుల నుంచి మంచి నటన రాబట్టాలంటే ఇలా కూడా చేయాలా..?
చార్మి కథానాయికగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం ప్రచార చిత్ర ఆవిష్కరణ, చార్మి పుట్టినరోజు వేడుకలు ఒకేసారి ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగాయి. చార్మిని మెచ్చుకొనే ‘చార్మ్ మి’ పోటీలో విజేతలైన అభిమానుల ప్రశంసలు, దర్శక, నిర్మాతలు, చిత్ర యూనిట్ అభినందనల మధ్య ఉక్కిరిబిక్కిరైన చార్మి ‘‘నా జీవితంలో ఇది బెస్ట్ బర్త్‌డే’’ అని వ్యాఖ్యానించారు.
‘‘నిర్మాత సి. కల్యాణ్ నాకు ‘జ్యోతిలక్ష్మీ’ సినిమానే కాకుండా, నిన్ననే డైమండ్ ఉంగరం కూడా బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారు’’ అని చెప్పారు. ‘‘చార్మిని రోజూ పొగడాలి. పొగిడితే కానీ పనిచేయదు. డెరైక్షన్ కన్నా పొగడడం కష్టం’’ అని పూరీ జగన్నాథ్ చమత్కరించారు. సినిమా గురించి ఆయన చెబుతూ, ‘‘రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ కథ రాసినప్పుడు నేను పుట్టాను. అది వచ్చిన పాతికేళ్ళకు ఈ అమ్మాయి (చార్మి) పుట్టింది. ఇన్నేళ్ళుగా ఈ కథ ఈమె కోసమే ఆగి ఉందేమో’’ అని వ్యాఖ్యానించారు. ఈ సినిమాలో తానే స్వయంగా బుల్లెట్ నడిపాననీ, అదీ ఒకే టేక్‌లో ఓకె చేశాననీ చార్మి స్పష్టం చేశారు.