సంబంధిత వార్తలు
- వైకాపాకు షాక్ : తాడిపత్రి మున్సిపాలిటీ తెదేపా కైవసం
- ఇనుప చువ్వలపై పడిన కార్మికుడు.. గొంతులో దిగి.. కుడికన్ను దిగువ నుంచి..?
- ఛత్తీస్గఢ్లో పోలీస్ కానిస్టేబుళ్లుగా 13మంది
- క్రీడా రంగంలో తడాఖా చూపెట్టిన మహిళా క్రీడాకారులు.. నాన్న రిక్షా డ్రైవర్, తల్లి నర్సు, చేతిలో విల్లు...?!
- హస్తకళాకారుల ఉన్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విభిన్న కార్యక్రమాల అమలు: లక్ష్మినాధ్
కేరళలో ప్రమాదం తప్పింది.. పిట్టగోడ వద్ద నిల్చుని వుంటే పడిపోయాడు.. (video)
Man
వివరాల్లోకి వెళితే.. కేరళలోని ఓ ప్రభుత్వం కార్యాలయం ముందు కొంతమంది క్యూలో నిలుచుని ఉన్నారు. అయితే ఆ ఆఫీసు ఓ అపార్టుమెంటులోని మొదటి అంతస్తులో ఉంది. ఈ నేపథ్యంలో పని మీద అక్కడికి రెడ్ షర్ట్ ధరించిన వ్యక్తితో పాటు మరికొందరూ వచ్చారు. వారంత ఆఫీసు బయట పిట్ట గోడ వద్ద నిలుచుని ఉన్నారు. ఈ క్రమంలో కొద్ది సమయానికి అకస్మాత్తుగా ఆ వ్యక్తి కళ్లు తిరగడంతో ఉన్నచోటనే వెనక్కి వెల్లకిల ఆ పిట్ట గోడపై నుంచి కిందకు పడబోయాడు.
పక్కనే ఉన్న మరో వ్యక్తి అప్రమత్తమై అతడు పడిపోకుండా పట్టుకున్నాడు. అది చూసిన ఆఫీసు సిబ్బంది హుటాహుటిన బయటకు పరుగెత్తుకుంటు వచ్చి అతడికి సాయం చేశారు. చివరకు ఎలాగోలా ఆ వ్యక్తిని పైకి లాగి రక్షించారు. ఇది చూసిన నెటిజన్లు ఓ మై గాడ్ ఎంత ప్రమాదం తప్పింది అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా ఆతనిని కాపాడిన వ్యక్తిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.
OMG!!!
— ᴅɪᴠʏᴀ ᴀʀᴊᴜɴ~ദിവ്യ
A person fainted & went to fall from a building. Luckily he survived by help of another person who was standing beside him. #viralvideo #kerala pic.twitter.com/vemT3L1PoC
