శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 5 ఏప్రియల్ 2018 (09:39 IST)

కర్ణాటక పోల్స్ : కమలనాథులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్న శివసేన

కర్ణాటక శాసనసభకు వచ్చే నెల 12వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా, ప్రస్తుతం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో కమలనాథులకు దానిమిత్రపక్షమైన శివసేన వణుకుపుట

కర్ణాటక శాసనసభకు వచ్చే నెల 12వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల కాగా, ప్రస్తుతం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో కమలనాథులకు దానిమిత్రపక్షమైన శివసేన వణుకుపుట్టిస్తోంది. ఇప్పటికే కేంద్రంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన... మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో బీజేపీ - శివసేన బంధం పూర్తిగా చెడిపోయింది. 
 
ఇకపోతే, ఇపుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పక్కలో బల్లెంలా శివసేన వ్యవహరిస్తోంది. దీంతో కమలనాథులు వణికిపోతున్నారు. కరుడుగట్టిన హిందుత్వవాది, శ్రీరామసేన అధ్యక్షుడు ప్రమోద్‌ ముథాలిక్‌ను బరిలోకి దింపింది. శ్రీరామసేన జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూనే శివసేనలో ముథాలిక్‌ క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారు. 
 
దక్షిణ అయోధ్యగా పేరు గడించిన చిక్కమగళూరు జిల్లా దత్తపీఠం వివాదంలో బీజేపీ వైఖరితో మండిపడుతున్న ముథాలిక్‌.. ఆ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. చిక్కమగళూరులో బుధవారం ఆయన మాట్లాడుతూ బీజేపీది కుహనా హిందుత్వమని వ్యాఖ్యానించారు. శివసేనతో కలిసి తాము 60 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్టు ప్రటించారు. ఇది బీజేపీ నేతలకు ఏమాత్రం రుచించడం లేదు.