ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (15:32 IST)

డబ్బు లేనప్పుడు ఇంటికి ఎందుకు తాళం వేశారు.. కలెక్టర్‌కు నోట్ రాసిన దొంగ

Thief
ఓ దొంగ ప్రభుత్వ అధికారి నోట్ ప్యాడ్‌ను పెన్నును ఉపయోగించాడు. ఎందుకో తెలుసుకోవాలంటే... ఈ కథనంలోకి వెళ్లాల్సిందే. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలోని ఒక ప్రభుత్వ అధికారి నివాసంలోకి దొంగ చొరబడ్డాడు. 
 
అక్కడ తగినంత నగదు, విలువైన వస్తువులను కనుగొనలేకపోయినందుకు నిరాశకు గురైన ఒక దొంగ, “డబ్బు లేనప్పుడు ఇంటికి ఎందుకు తాళం వేశారు” అని అడిగిన నోట్‌ను అక్కడే వదిలేసి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. 
 
దొంగ రాసిన నోట్ కాపీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం జిల్లాలోని ఖటేగావ్ పట్టణంలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎమ్) గా నియమించబడిన త్రిలోచన్ సింగ్ గౌర్ నివాసంలో రూ.30,000 నగదు, కొన్ని ఆభరణాలు దొంగిలించబడ్డాయని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ ఉమ్రావ్ సింగ్ తెలిపారు.
 
పదిహేను రోజుల విరామం తర్వాత శనివారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు దొంగతనం గురించి కలెక్టర్‌కు తెలిసింది. ఇంకా దొంగ రాసిన నోట్ దొరికింది. దొంగ నోట్ రాయడానికి ప్రభుత్వ అధికారి నోట్‌ప్యాడ్, పెన్ను ఉపయోగించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.