శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2019 (10:29 IST)

భారతీయ జర్నలిస్టుకు ప్రతిష్టాత్మక మెగాసెసే అవార్డు

భారతీయ జర్నలిస్టు రవీష్ కుమార్‌కు ప్రతిష్టాత్మక రామన్ మెగాసెసే అవార్డు వరించింది. 2019 సంవత్సరానికిగాను ఆయన ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును వచ్చే సెప్టెంబరు తొమ్మిదో తేదీన మనీలాలో జరుగనున్న కార్యక్రమంలో అందజేయనున్నారు. 
 
ఈయనతో పాటు మియన్మార్‌కు చెందిన ఓ జర్నిలిస్టు కో స్వో విన్, థాయ్‌లాండ్‌కు చెందిన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అంఖానా, నీలపాజిత్, ఫిలిప్పీన్స్ మ్యూజిషియన్, సౌత్ కొరియాకు చెందిన వర్కింగ్ యాక్టివిస్ట్‌లు కూడా ఈ అవార్డు వరించిన వారిలో ఉన్నారు.