గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (16:50 IST)

తేజస్​ యుద్ధవిమానంలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య జర్నీ.. ఫోటోలు వైరల్

Tejasvi Surya
తేజస్​ యుద్ధవిమానంలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ప్రయాణించారు. ప్రస్తుతం తేజస్వీ సూర్య తేజస్‌లో జర్నీ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని యళహంక వేదికగా జరుగుతున్న 'ఏరో ఇండియా' ప్రదర్శనకు వచ్చిన ఆయన ఫ్లయింగ్​ సూట్​ ధరించి ఈ విమానంలో విహరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన తన ట్విటర్ ఖాతాలో షేర్‌ చేశారు. 
 
తేలికపాటి యుద్ధవిమానం(LAC)తేజస్.. ఆత్మనిర్భర్ భారత్ సింబల్ అని.. భారతదేశపు సైంటిఫిక్ ఎక్సలెన్స్ మరియు శక్తిసామర్థ్యాలను చూపే ఓ సంకేతమని ఈ సందర్భంగా తేజస్వీ సూర్య వ్యాఖ్యానించారు. ఈ అధ్భుతమైన ఫైటర్ జెట్‌లో ఇవాళ ప్రమాణించేందుకు తనకు అవకాశం దక్కడం చాలా ఆనందం కలిగించిందని తెలిపారు. భారత్ కు బెంగుళూరు గిఫ్ట్ 'తేజస్'అని ఈ యువ బీజేపీ ఎంపీ పేర్కొన్నారు.
 
కాగా, భారత వాయుసేన శక్తి సామర్థ్యాలను చాటిచెప్పే 'ఏరో ఇండియా' ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంటోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని యళహంకలో 13వ 'ఏరో ఇండియా' ప్రదర్శనను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ బుధవారం ప్రారంభించారు. 
 
తొలి రోజు రఫేల్‌, అమెరికా వైమానిక సంస్థకు చెందిన బీ-1బీ ల్యాన్సర్‌ సూపర్‌సానిక బాంబర్‌లు అలరించాయి. నాలుగేళ్ల కిందట భారతీయ వైమానిక విభాగంలో చేరిన ఎల్‌సీఏ తేజస్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సారంగ్‌, సూర్యకిరణ్‌ విమానాలు, సుఖోయ్‌ 30-ఎంకే1 విన్యాసాలతో ఆకట్టుకున్నాయి. శుక్రవారం వరకు ఈ ప్రదర్శన సాగనుంది.