శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2023 (22:15 IST)

సీఆర్పీ ద్వారా పాముకు ప్రాణం పోసిన పోలీస్ కానిస్టేబుల్

cpr to snake
సాధారణంగా గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ ద్వారా ప్రాణంపోస్టుంటారు. ఇలాంటి సంఘటన దేశంలో ఎక్కడో ఒక చోటు జరుగుతూనే ఉంటాయి. అయితే, సీపీఆర్ ద్వారా కేవలం మనుషులకే కాదు పాములకు కూడా ప్రాణం పోయొచ్చని మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ కానిస్టేబుల్‌ నిరూపించారు. పాముల నోట్లో గాలి ఊదడం ద్వారా చనిపోయాయనుకున్న చాలా పాములను తాను కాపాదానని తెలిపారు. 
 
తాజాగా ఓ పాముకు ఆయన సీపీఆర్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పురుగు మందు కలిపిన నీళ్లను తాగి చలనం లేకుండా పడి ఉన్న ఆ పాములో మళ్లీ కదలిక రావడం ఈ వీడియోలో కనిపించింది. అయితే, నిపుణులు మాత్రం ద్వారా పాములు బతకవని, ఈ సంఘటనలో ఆ పాము తనకు తానుగానే మళ్లీ స్పృహలోకి
వచ్చి ఉంటుందని చెబుతున్నారు.
 
ఇటీవల నర్మదాపురం పట్టణంలోని ఓ కాలనీలోకి పాము చొరబడింది. ఓ ఇంట్లోని పైప్ లైన్‌లో చేరింది. దీనిని బయటకు వెళ్లగొట్టేందుకు ఆ ఇంటివాళ్లు విషం కలిపిన నీళ్లను పైపులోకి జారవిడిచారు. ఆ నీళ్లు తాగిన పాము కాసేపటికి బయటపడింది. అయితే, పాములో చలనం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. 
 
స్థానికంగా పని చేసే పోలీస్ కానిస్టేబుల్ అతుల్ శర్మ అక్కడికి చేరుకుని పామును పరిశీలించారు. ఆ పాము విషపూరితం కాదని, కొన ఊపిరితో ఉందని గుర్తించి సీపీఆర్ చేశారు. పాము నోట్లో నోరు పెట్టి గాలి ఊదారు. కాసేపు ప్రయత్నించిన తర్వాత ఆ పాము కళ్లు తెరిచింది. మరికాసేపటికి పూర్తిగా స్పృహలోకి వచ్చిన ఆ పామును అడవిలో వదిలేసినట్లు అతుల్ శర్మ తెలిపారు. డిస్కవరీ ఛానెల్ చూస్తూ ఈ సీపీఆర్ పద్ధతి గురించి తెలుసుకున్నానని, గత పదిహేనేళ్లలో దాదాపు 500 లకు పైగా పాములను ఇలాగే కాపాదానని వివరించారు.