1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2023 (22:05 IST)

ఆకాశంలో ఎగిరిన హనుమాన్ డ్రోన్‌.. వీడియో వైరల్

Flying Hanuman
Flying Hanuman
హనుమాన్ అంటే బలశాలి. పరాక్రమవంతుడు. అలాంటి హనుమంతుడు ఆకాశంలో, కొండలపైకి సునాయాసంగా ఎగరడం సర్వసాధారణం. అయితే తాజాగా హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నట్లు ఉన్న డ్రోన్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 
 
ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లోని మహామాయ ఆలయంలో దసరా సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్‌ ఆకారంలో ఉన్న డ్రోన్‌ ఎగురవేశారు. 
 
అయితే హనుమంతుడి డ్రోన్‌ ఎగురవేయడం ఇది తొలిసారి కాదు. యూపీ రాజధాని లక్నోలో, పంజాబ్‌లోని లుధియానాలో కూడా హనుమాన్‌ డ్రోన్లను ఎగురవేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.