గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 మే 2023 (20:31 IST)

ఫోన్ లాక్కున్న పాపానికి టీచర్‌పై పెప్పర్ స్ప్రే చల్లింది..

spray
క్లాస్ రూమ్‌లో ఓ టీచర్‌కు చేదు అనుభవం ఎదురైంది. క్లాస్ రూమ్‌లో ఓ విద్యార్థిని ఫోన్‌ను మగ టీచర్ లాక్కున్నాడు. అంతే ఆ యువతి ఏం చేసిందో తెలుసా.. పెప్పర్ స్ప్రేతో టీచర్‌పై దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 
 
తరగతి సమయంలో ఆన్‌లైన్‌లో సమాధానాల కోసం సెర్చ్ చేస్తున్న యువతి వద్ద నుంచి ఫోన్‌ను టీచర్ లాక్కున్నాడు. అయితే తరగతి నుంచి బయటికి రాగానే.. టీచర్‌పై రెండుసార్లు పెప్పర్ స్ప్రే ఉపయోగించి దాడి చేసింది. ఆమె తన ఫోన్ తిరిగి ఇవ్వమని పట్టుబట్టి అతనిని వెంబడించింది.
 
ఆపై పెప్పర్ స్ప్రేతో దాడి చేయడంతో టీచర్ నేలపై కూలిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్టూడెంట్‌పై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు.