1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 10 జూన్ 2024 (12:02 IST)

ఒకే రన్ వే పైన రెండు విమానాలు, తప్పిన పెను ప్రమాదం (video)

Two planes on same runway in Mumbai airport
ముంబయి విమానాశ్రయంలో పెనుప్రమాదం తప్పింది. ఇండిగో ఎయిర్ క్రాఫ్ట్ విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు అదే రన్ వే పైన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతోంది. ఈ రెండు విమానాలు మధ్య కేవలం వందల మీటర్ల దూరం మాత్రమే వుంది. కొద్ది సెకన్లలో తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఈ రెండు విమానాల్లో వందల మంది ప్రయాణిస్తున్నారు.
 
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఇండోర్ నుంచి ఇండిగో విమానం వస్తుండగా... ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయ్యింది. ఈ ఘటన శనివారం నాడు జరుగగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని తక్షణమే విధుల నుంచి తప్పించింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.