1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By డివి
Last Modified: గురువారం, 5 ఆగస్టు 2021 (13:52 IST)

నీహారిక భర్త చైతన్య అపార్ట్‌మెంట్ గొడ‌వ, మందు కొడుతున్న వీడియో చూపించారు?

నాగ‌బాబు కుమార్తె నీహారిక త‌న భ‌ర్త చైతన్య జొన్నలగడ్డతో బంజారాహిల్స్‌లోని అపార్ట్‌మెంట్‌లో వుంటోంది. అయితే దానికి స‌మీపంలో మ‌రో అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుని చైత‌న్య సినిమా ఆఫీసు పెట్టాల‌ని నిర్ణ‌యించారు. ఇటీవ‌లే ఫ్రెండ్‌షిప్‌డే నాడు అపార్ట్‌మెంట్ ప‌రిధిలో స్నేహితుల‌తో పార్టీ ఏర్పాటు చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నించారు.
 
కానీ అందుకు అపార్ట్‌మెంట్ వారు అనుమ‌తి ఇవ్వ‌లేదు. అయితే బుధ‌వారంనాడు అపార్ట్‌మెంట్ వాసులు ఇక్క‌డ  ఆఫీసు వుండ‌కూడ‌ద‌ని తెగేసి చెప్పారు. ఈ క్రమంలోనే చైతన్యకు, అపార్టుమెంట్ వాసులకు మధ్య గొడవ జరిగింది. తమ ఆఫీసులోకి అక్రమంగా ప్రవేశించి గొడవకు దిగారని చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
అపార్ట్‌మెంట్‌లో త‌ర‌చూ చైత‌న్య స్నేహితులు వ‌చ్చి మందు తాగి గొడ‌వ చేస్తున్నార‌ని అపార్ట్‌మెంట్ వాసులు బంజారాహిట్స్ పోలీసుల ముందు వీడియో చూపించారు. దాంతో తేలుకుట్టిన చందంగా పోలీసులు రాజీ కుదిర్చారు. ఇక ఈ విష‌య‌మై నాగ‌బాబు పోలీసుల‌తో మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. ఇలాంటివి జ‌రిగితే ముందుగా ఎందుకు చెప్ప‌లేద‌ని అపార్ట్‌మెంట్‌లో త‌న‌కు తెలిసిన ఓ వ్య‌క్తితో అన్నాడ‌ని తెలుస్తోంది. సో... గొడ‌వ స‌ద్దుమ‌ణిగిన‌ట్లే.