శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (17:24 IST)

వీడు మనిషే కాదు... మృగం.. పట్టపగలు, నడిరోడ్డులో మహిళను కత్తితో పొడిచి..? (Video)

COVID-19 ను పెంచడంలో కుంభమేళా పాత్ర గురించి మాట్లాడినందుకు ప్రగ్యా మిశ్రా అనే జర్నలిస్టును హత్య చేసినట్లు వీడియోలో తెలుస్తోంది. పట్టపగలే రోడ్డుపై నిల్చుని వాదనతో ఒక వ్యక్తి ఆమెను కత్తితో పొడిచి చంపే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పెరుగుతున్న మహమ్మారి మధ్య కుంభమేళాపై విమర్శనాత్మకంగా నివేదించినందుకు ఉత్తర ప్రదేశ్ జర్నలిస్ట్ ప్రగ్యా మిశ్రా పగటిపూట హత్యకు గురైనట్లు వాట్సాప్‌లో వీడియో సర్క్యులేట్ అవుతోంది. 
 
ఈ వీడియోలో ఒక వ్యక్తి మహిళను పొడిచి చంపిన సిసిటివి ఫుటేజీతో వుంది. ఫేస్‌బుక్‌లో మలయాళ క్యాప్షన్ ఉన్న చిత్రాలు లేకుండా క్లెయిమ్ కూడా తిరుగుతోంది. క్రింద ఉన్న పోస్ట్‌లో 4,600 షేర్లు ఉన్నాయి. అయితే తన హత్య పుకార్లను తెరదించేందుకు ప్రగ్యా మిశ్రా ట్విట్టర్‌లో క్లారిటీ ఇచ్చింది. "నేను కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించి ఇంట్లో ఉన్నాను. తాను సజీవంగా మరియు సురక్షితంగా ఉన్నాను. నా హత్య పుకార్లు అబద్ధం" అని ఆమె రాసింది.
 
వాస్తవానికి ఈ ఘటనకు ఢిల్లీకి సంబంధించినవి. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో హరీష్ మెహతా అనే వ్యక్తి తన భార్యపై కత్తితో దాడి చేసి చంపాడని వార్తలు వస్తున్నాయి. అతను తన భార్యపై అనుమానంతో ఈ పని చేశాడని మీడియాలో వెల్లడి అయ్యింది. మృతురాలైన నీలు మెహతా ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో పనిచేసేది. హరీష్ తన భార్య వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం కలిగివుందనే అనుమానంతో చాలామంది చూస్తుండగా పట్టపగలే నడిరోడ్డుపై కత్తితో అమానుషంగా పొడిచి చంపాడు. 
 
ఆమెను కాపాడేందుకు వచ్చిన వ్యక్తుల్ని హత్య చేసిన వ్యక్తి కత్తి చూపెట్టి బెదిరించడంతో.. వారందరూ తమ పని తాము చూసుకుపోయారు. రోడ్డుపై బైకులు, కార్లు తిరుగుతున్నా.. ఆ హంతకుడిని ఏమీ చేయలేకపోయాయి. చివరికి తన భార్యను కసితీరా ఆ కర్కశుడు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటనను కళ్లారా చూసిన చాలామంది ఆమెను కాపాడటానికి బదులుగా ఫుటేజ్ రికార్డ్ చేసుకున్నారు. అంతేగాకుండా తమకు ఎందుకు అనవసర వ్యవహారం అంటూ తలుపులు మూతెట్టుకున్నారు. ఈ వీడియోను ఓ లుక్కేయండి.