శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 19 ఫిబ్రవరి 2022 (22:51 IST)

వైభవంగా 108 దివ్యదేశ మూర్తులకు శాంతి కల్యాణం

శ్రీరామనగరి సమేత మూర్తి ప్రాంగణంలో కొలువుదీరిన 108 దివ్యదేశ మూర్తులకు శాంతి కల్యాణం వైభవంగా జరుగుతోంది. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ లోని ముచ్చింతల్ ప్రాంతం శోభాయమానంగా మారింది.

 
వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి రిథ్విక్‌లు విచ్చేసారు. కొంతమంది అమెరికా, దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి యజ్ఞంలో పాల్గొనడానికి మాత్రమే వచ్చారు. వైదిక సంప్రదాయం ప్రకారం యజ్ఞం పూర్తయిన తర్వాత వారిని సత్కరిస్తారు.

 
ఉత్తర ఫాల్గుణి నక్షత్రం శనివారం వచ్చింది కనుక ఈ రోజు శాంతి కల్యాణం నిర్వహిస్తున్నట్లు చిన్నజీయర్ వెల్లడించారు.