సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 1 జూన్ 2023 (18:50 IST)

నాటు నాటు పాటకు డ్యాన్స్ చేసిన ఉక్రెయిన్ మిలిటరీ (video)

Natu Natu
ఉక్రెయిన్‌లోని మైకోలైవ్‌కు చెందిన మిలిటరీ సైనికులు ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు డ్యాన్స్ అదరగొట్టారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట ప్రపంచ వ్యాప్తంగా హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఈ పాటకు కీరవాణీ ఆస్కార్ అవార్డును అందుకున్నారు. 
 
ఇక ఉక్రేనియన్ మిలిటరీ ఈ ఆకర్షణీయమైన ట్యూన్‌ను వారి సొంత ప్రత్యేక నైపుణ్యంతో రీమిక్స్‌లా.. ప్యారడీలా
Natu Natu
చేసి అందుకు స్టెప్పులు కూడా చేశారు. ఈ వీడియో కాస్త ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలైన కొద్ది గంటల్లోనే వీడియో వైరల్‌గా మారింది. మిలియన్ల మంది వీక్షణలు, షేర్‌లను పొందింది. సైనిక సిబ్బంది ప్రదర్శించిన స్టెప్పులు భలే అనిపిస్తున్నాయి.