సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (19:54 IST)

రష్మిక నాటు నాటుతో అదిరిన ఐపీఎల్ 2023 ఓపెనింగ్ వేడుకలు

Rashmika Mandanna
ఐపీఎల్ 2023 ఓపెనింగ్ వేడుకలు ప్రారంభమైనాయి. ప్రముఖ నటి రష్మిక మందన్న తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మెప్పించింది. అపరిమితమైన శక్తితో, ఆమె ఆర్ఆర్ఆర్ నుంచి "నాటు నాటు" ట్యూన్‌కి అత్యుత్తమ ప్రదర్శనను అందించింది. 
 
సాంప్రదాయ ఐవరీ-బంగారు లెహంగా ధరించి, ఆమె ఎప్పటిలాగే అద్భుతంగా కనిపించింది. ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకను మందిరా బేడీ ప్రారంభించారు, గుజరాత్ టైటాన్స్- చెన్నైసూపర్ కింగ్స్ మధ్య టోర్నమెంట్ తొలి మ్యాచ్ నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనుంది. 
 
ఐపీఎల్ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ సహా పది జట్లు ఉన్నాయి. ప్రారంభ వేడుకలో, ఐపీఎల్ 2023 ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్, హార్దిక్ పాండ్యా, మహేంద్ర సింగ్ ధోనీలను వేదికపైకి స్వాగతించారు. సీజన్ కోసం ట్రోఫీని ఆవిష్కరించారు.