గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2023 (13:35 IST)

పుష్ప2లోనూ అల్లు అర్జున్‌ మేనరిజం ఎలా వుంటుందంటే!

Arjun's mannerism
Arjun's mannerism
అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమాలో తగ్గెదేలె అంటూ గడ్డంకింద చేతిని పెట్టుకుని హీరో చేసిన మేనరిజం ఎంత పాపులర్‌ అయిందో తెలిసిందే. క్రికెటర్స్,  విదేశీయులు కూడా  దానిని ఫాలో అయ్యారు. ఇప్పుడు పుష్ప2 సినిమా షూట్‌ జరుగుతోంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటలు శ్రీకాంత్‌ విస్సా సమకూరుస్తున్నాడు. ఈయన తాజాగా పలు అగ్రహీరోల సినిమాలకు పనిచేస్తున్నాడు. విజయవాడకు చెందిన శ్రీకాంత్‌ విస్సా 18 పేజెస్‌ చిత్రానికి పనిచేశాడు.
 
ఇటీవలే పుష్ప2లో డైలాగ్‌ వర్షన్‌ రాశాడు. సుకుమార్‌ నాలుగు వర్షన్‌లు రాయించారట. సీక్వెల్‌లోనూ అల్లు అర్జున్‌కు మేనరిజం వుంది. మొదటిభాగంలో వున్న మేనరిజంకు తోడు సరికొత్తగా మరోటి వుంటుందనీ అది సినిమాలో మరింత హైలైట్‌ అవుతుందని చెబుతున్నారు. డైలాగ్స్‌ కూడా నాచురల్‌గా పాన్‌ ఇండియా సినిమా స్థాయికి తగినట్లుగా అన్ని భాషలవరకు వర్తించేలా జాగ్రత్తలు సుకుమార్‌ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఫారెస్ట్‌ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త సీన్స్‌ చిత్రీకరణ జరుగుతోంది. త్వరలో మరింత సమాచారం రానుంది.