గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

అల్లు అర్జున్ వరుడు తర్వాత సినిమా అవకాశాలు లేవు : భానుశ్రీ

bhanu shi mehra
టాలీవుడ్ నటి భానుశ్రీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన వరుడు చిత్రం తర్వాత తనకు సినిమా అవకాశాలు లేకుండా పోయాయని ఆమె వాపోయారు. ఆయనతో కలిసి పనిచేసిన తర్వాత తనకు అవకాశాలు పూర్తిగా లేకుండా పోయాయని, తన కెరీర్‌లో ఎన్నో ఓటములను చవిచూశానని చెప్పారు. వాటి నుంచి తాను ఇపుడుడిపుడై గుణపాఠాలు నేర్చుకుంటున్నానని తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆమె తాజాగా స్పందిస్తూ, 'అల్లు అర్జున్‌తో కలిసి 'వరుడు' సినిమాలో నటించాను. అయినప్పటికీ నాకెలాంటి అవకాశాలు రాలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి. సమస్యల్లోనే సంతోషాన్ని వెతుక్కోవడం నేర్చుకున్నాను. మరీ, ముఖ్యంగా అల్లు అర్జున్‌ ట్విటర్‌లో నన్ను బ్లాక్‌ చేశారని తెలుసుకున్నా' అని పేర్కొంది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు.. 'అసలు ఏమైంది?' అంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు.
 
అలా ట్వీట్ చేసిన మూడు గంటల్లోనే ఆమె అల్లు అర్జున్ గురించి మరో ట్వీట్ చేశారు. బన్నీ తనని అన్‌బ్లాక్‌ చేశారని పేర్కొన్నారు. 'గ్రేట్‌ న్యూస్‌.. బన్నీ నన్ను అన్‌బ్లాక్‌ చేశాడు!! నా కెరీర్‌ పరాజయానికి నేను ఆయన్ని ఎప్పుడూ నిందించలేదు. కష్టాల నుంచే ఎన్నో నేర్చుకుంటూ ముందుకు సాగిపోతున్నా' అని ఆమె వివరించారు.