శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 జనవరి 2023 (12:47 IST)

రాజ్యాంగకర్తలను స్మరించుకుంటూ వారి బాటలో నడుద్దాం : సీఎం జగన్

ysjagan
భారత 74వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఏపీ గవర్నర్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ రోజు అని సీఎం జగన్ గుర్తుచేశారు. ఈ రిపబ్లిక్ డేను పురస్కరించుకుని ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
"స్వ‌తంత్ర భార‌తదేశాన్ని గ‌ణ‌తంత్ర రాజ్యంగా మార్చిన‌ రాజ్యాంగం అమల్లోకి వ‌చ్చి 73 సంవ‌త్స‌రాలు పూర్తైన సంద‌ర్భంగా ఈ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం నాడు మ‌న రాజ్యాంగక‌ర్త‌ల‌ను స్మ‌రించుకుంటూ వారి బాటలో న‌డిచి దేశ అభ్యున్న‌తికి కృషి చేద్దాం" ఆయన పేర్కొన్నారు. 
 
కాగా, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గురువారం గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ వేడుకల్లో సీఎం జగన్, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.