1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated: శనివారం, 11 ఫిబ్రవరి 2023 (18:59 IST)

బ్రెడ్ ప్యాకెట్‌లో ఎలుక.. బ్లింకిట్‌లో గ్రోసరీ ఆర్డర్ చేస్తే..

Bread
Bread
బ్రెడ్ ప్యాకెట్‌లో ఎలుక బయటపడింది. బ్లింకిట్‌లో గ్రోసరీ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి ఈ షాక్ తప్పలేదు. ఆర్డర్ పెట్టిన వాటిల్లో బ్రెడ్ ప్యాకెట్‌లో ఎలుక వుండటంతో షాక్ అయ్యింది. నితిన్ అరోరా అనే వ్యక్తి బ్లింకిట్ లో గ్రోసరీ ఆర్డర్ చేశాడు. 
 
అందులో బ్రెడ్ ప్యాకెట్ కూడా ఒకటి. బ్లింకిట్ ఎగ్జిక్యూటివ్ డెలివరీ చేసి వెళ్లిపోయాడు. ఆ ప్యాక్ చేసిన అరోరాకు షాక్ తప్పలేదు. బ్రెడ్ ప్యాకెట్‌లోకి ఎలుక దూరి అక్కడి నుంచి బయటకు రాలేక ఇరుక్కుపోయింది. 
 
తనకు ఎంతో అసౌకర్యమైన అనుభవం ఎదురైనట్టు ట్విట్టర్‌లో తెలిపారు. పది నిమిషాల డెలివరీలో ఇలాంటివి గమనించట్లేదని తెలిపారు. ఇన్‌స్టంట్‌గా డెలివరీ ఇక ఆశించనని.. తాను గంటల కొద్దీ వేచి చూడడానికి వెనుకాడను అంటూ ఆయన ట్వీట్ చేశారు.